ఓటీటీలోకి కుబేర ఎప్పుడొస్తుందంటే..
తమిళ స్టార్ హీరో ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వచ్చిన సినిమా కుబేర.
By: Tupaki Desk | 8 July 2025 4:00 PM ISTతమిళ స్టార్ హీరో ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వచ్చిన సినిమా కుబేర. నిరుపేద, ధనిక వ్యతాసం చూపిస్తూ కుబేరను శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడిగా నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు. నాగార్జున, రష్మిక కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికీ సక్సెస్‌ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతుంది.
జూన్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన కుబేర సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ అప్డేట్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, జులై 18 నుంచి కుబేర ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ తేదీ అలానే ఉంటుందా లేదా కుబేర థియేటర్లలో మంచి రన్ అందుకుంటున్న నేపథ్యంలో మారుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ప్రైమ్ వీడియో నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ప్రైమ్ వీడియో కుబేర డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకోగా, త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా కుబేర సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. యూఎస్ లో కుబేర ఇప్పటికే 2.4 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. శేఖర్ కమ్ముల రైటింగ్, డైరెక్షన్ తో పాటూ ప్రధాన పాత్రధారులైన ధనుష్, నాగార్జున, రష్మిక యాక్టింగ్, దేవీ శ్రీ ప్రసాద్ సాంగ్స్, బీజీఎం కుబేరను తర్వాతి స్థాయిలో నిలబెట్టాయి.