ఈ వారం కొత్త రిలీజులివే..
జూన్ లో ఆఖరి వారం వచ్చేసింది. ప్రతీ వారం లాగే ఈ వారం కూడా కొత్త సినిమాలు ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాయి.
By: Tupaki Desk | 23 Jun 2025 12:59 PM ISTజూన్ లో ఆఖరి వారం వచ్చేసింది. ప్రతీ వారం లాగే ఈ వారం కూడా కొత్త సినిమాలు ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజవుతుండగా, మరిన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో రిలీజవనున్నాయి. మంచు విష్ణు హీరోగా అతని డ్రీమ్ ప్రాజెక్టుగా భారీ తారాగణంతో రూపొందిన కన్నప్ప సినిమా జూన్ 27న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన మార్గన్: ది డెవిల్ తెలుగు, తమిళ భాషల్లో అదే రోజున రిలీజ్ కానుంది. ఇక బాలీవుడ్ నుంచి కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన హార్రర్ థ్రిల్లర్ మా కూడా జూన్ 27నే రిలీజ్ కాబోతుంది. ఇవి కాకుండా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. అవేంటో చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్‌లో..
రైడ్ అనే హిందీ సినిమా
స్క్విడ్ గేమ్ వెబ్‌సిరీస్ ఫైనల్ సీజన్
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో అనే రియాలిటీ షో
పింటు పింటు సుర్గా అనే హాలీవుడ్ మూవీ
ప్రైమ్ వీడియోలో..
పంచాయత్ అనే హిందీ వెబ్‌సిరీస్ సీజన్4
జియో హాట్‌స్టార్‌లో..
స్మార్ట్ ఆఫ్ బ్యూటీ అనే వెబ్‌సిరీస్
ది గిల్డెడ్ ఏజ్ అనే వెబ్‌సిరీస్ సీజన్3
తు దడ్కన్ మే దిల్ అనే బాలీవుడ్ మూవీ
ఐరన్ హార్ట్ అనే సినిమా
ది బేర్ అనే వెబ్‌సిరీస్ సీజన్4
ది బ్రూటలిస్ట్ అనే సినిమా
మిస్టరీ అనే వెబ్‌సిరీస్
జీ5లో..
విరాటపర్వం: పీసీ మీనా రిపోర్టింగ్ అనే తెలుగు వెబ్‌సిరీస్
బిబిషన్ అనే బెంగాలీ వెబ్‌సిరీస్