ఆమె ఎంట్రీతో ఆట తారుమారు.. వాళ్ల ముగ్గురికి ఎఫెక్ట్..?
బిగ్ బాస్ సీజన్ 9లో శ్రీజ రీ ఎంట్రీ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఐతే ఆమె ఎంట్రీతో హౌస్ లో ఆట తీరు కచ్చితంగా మారుతుందని చెప్పొచ్చు.
By: Ramesh Boddu | 29 Oct 2025 9:15 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో శ్రీజ రీ ఎంట్రీ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఐతే ఆమె ఎంట్రీతో హౌస్ లో ఆట తీరు కచ్చితంగా మారుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే హౌస్ లో ఆట అంతా ఒక మాదిరిగా వెళ్తుంది. మెజారిటీ పీపుల్ ఏది రైట్ అంటే అదే కరెక్ట్ అన్న విధంగా ఉంది. తప్పొప్పులు పక్కన పెడితే అసలు బిగ్ బాస్ టాస్క్ లను కూడా సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఇక టాస్క్ ల కన్నా గొడవలకు ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు.
సీజన్ 9లో భరణి, శ్రీజ ఇద్దరు హౌస్ లోకి రీ ఎంట్రీ..
ఐతే టాస్క్ లలో బాగా పర్ఫార్మ్ చేయడంతో పాటుగా టాకింగ్ పవర్ బాగున్న శ్రీజని హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేలా చేశారు. బిగ్ బాస్ సీజన్ 9లో ఈ ట్విస్ట్ అసలు ఊహించి ఉండరు. సీజన్ 9లో భరణి, శ్రీజ ఇద్దరు హౌస్ లోకి మళ్లీ వచ్చారు. శ్రీజ ఎలిమినేషన్ కేవలం వైల్డ్ కార్డ్స్ వల్లే కాబట్టి ఆమెను తీసుకొచ్చారు. మరోపక్క భరణి కూడా బాండింగ్స్ వల్ల హౌస్ లో సరిగా పర్ఫార్మ్ చేయలేదని ఫీల్ అయ్యారు.
ఐతే శ్రీజ రీ ఎంట్రీ వల్ల హౌస్ లో ముగ్గురు కంటెస్టెంట్స్ కి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. శ్రీజ ప్రతి విషయాన్ని నిలదీస్తుంది. ఐతే ఆమె ఒక విషయాన్ని ఎక్కడితో ఆపేయాలన్నది తెలియదు. అది ఒక్కటి మార్చుకుంటే మాత్రం బాగుంటుంది. ఇక శ్రీజ వల్ల టాప్ 5 లో ఉంటారని అనుకుంటున్న తనూజ, ఇమ్మాన్యుయెల్ తో పాటుగా మాధురి మీద శ్రీజ మొదటి నుంచి ఎటాకింగ్ జరుగుతుంది. అలా శ్రీజ హౌస్ లోకి నామినేషన్స్ కోసం ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం వచ్చి మాధురిని మళ్లీ టచ్ చేసింది.
గోల్డెన్ ఛాన్స్ శ్రీజ ఎలా వాడుకుంటుంది..
మొత్తానికి అలా శ్రీజ రీ ఎంట్రీ చాలా వరకు హౌస్ లో టాస్క్ లతో పాటు కావాల్సినంత రచ్చ వచ్చే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 9లో శ్రీ రీ ఎంట్రీ ఆమె ఫాలోవర్స్ కి హ్యాపీ అనిపించవచ్చు. ఐతే వచ్చిన ఈ గోల్డెన్ అవకాశాన్ని శ్రీజ ఎలా వాడుకుంటుంది అన్నది చూడాలి. ముందులా ప్రతి చిన్న విషయాన్ని నానా హంగామా చేయకుండా తన పాయింట్స్ పెట్టి ఆడితే మాత్రం ఆమె కూడా టాప్ 5కి వెళ్లే ఛాన్స్ ఉంది.
శ్రీజ టాప్ 5 కంటెస్టెంట్ అని హౌస్ లో ఉన్న వాళ్లకి కూడా తెలుసు. శ్రీజ రీ ఎంట్రీ వల్ల వాళ్లలో మళ్లీ ఒక భయం ఏర్పడింది. రావడం రావడమే తనూజ, కళ్యాణ్, మాధురి ఇలా అందరి మీద తన ఒపీనియన్ చెప్పింది. ఐతే హౌస్ లో ఆమె కొనసాగాలంటే హౌస్ మేట్స్ కూడా ఆమెకు కొన్ని సూచనలు ఇచ్చారు. వాటిని పాటిస్తే శ్రీజ తప్పకుండా ఈ సీజన్ చివరి వరకు ఉండే అవకాశం ఉంటుంది.
