Begin typing your search above and press return to search.

చెత్త షో.. రెబల్‌ కిడ్‌ చెత్త వ్యాక్యలు

'ది ట్రెయిటర్‌' అనే పేరుతో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ రియాల్టీ షో కాస్త అటు ఇటుగా బిగ్‌బాస్ షో మాదిరిగానే ఉంది.

By:  Tupaki Desk   |   24 Jun 2025 12:30 PM IST
చెత్త షో.. రెబల్‌ కిడ్‌ చెత్త వ్యాక్యలు
X

ఇండియాలో బిగ్‌బాస్‌ షో ఎంతటి వివాదాలను రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి భాషలో కొత్త సీజన్‌ ప్రారంభం సమయంలో, ఆ షో ప్రసారం అవుతున్న సమయంలో విమర్శలు వస్తూనే ఉంటాయి. చాలా మంది ఇలాంటి చెత్త షో లను బ్యాన్‌ చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. తెలుగులోనూ బిగ్‌ బాస్‌ ప్రసారం అవుతున్న సమయంలో చాలా సార్లు ఆందోళనలు జరిగాయి. ఏం జరిగినా, ఏం చేసినా బిగ్‌ బాస్ అనేది ఇండియాలో హిందీతో పాటు పలు భాషల్లో టెలికాస్ట్‌ అవుతూనే ఉంది. బిగ్‌ బాస్‌ తరహాలోనే మరికొన్ని కొత్త తరహా షో లు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఒక రియాల్టీ షో ప్రస్తుతం వివాదాస్పదం అయింది.

'ది ట్రెయిటర్‌' అనే పేరుతో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ రియాల్టీ షో కాస్త అటు ఇటుగా బిగ్‌బాస్ షో మాదిరిగానే ఉంది. ఈ షో లో బూతులు ఎక్కువ, అడల్ట్‌ కంటెంట్‌ ఎక్కువ. సినిమాలకు వెబ్‌ సిరీస్‌కు ఎలాంటి తేడా ఉంటుందో బిగ్‌ బాస్‌కి ది ట్రెయిటర్‌కి అలాంటి తేడా ఉంటుంది. అంటే అడల్ట్‌ కంటెంట్‌, యూత్‌ ను ఎట్రాక్ట్ చేసే విధంగా టాస్క్‌లు పెడుతున్నారు. ఈ షోలో అందరి దృష్టిని అపూర్వ మఖిజా ఆకర్షిస్తుంది. తనకు తాను రెబల్‌ కిడ్‌ అంటూ సోషల్‌ మీడియాలో పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఈ షో లో రెచ్చి పోతుంది. ఇప్పటికే పలు సార్లు నోరు జారింది. అయితే ఈసారి ఈమె తీరును ఏ ఒక్కరూ క్షమించడం లేదు. చాలా పెద్ద వారు అయిన సీనియర్‌ నటుడిని బూతు మాట అనడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.

ఈ రియాల్టీ షో లో అపూర్వ మఖిజాతో పాటు రఫ్తార్‌, కరణ్‌ కుంద్రా, ఉర్ఫీ జావేద్‌, జాస్మిన్‌ భాసిన్‌ తో పాటు సీనియర్‌ నటుడు ఆశిష్ విద్యార్థి సైతం ఉన్నారు. ఈ షో ను ఫాలో అయ్యే వారు చాలా మంది ఉన్నారు. అంతే కాకుండా సోషల్‌ మీడియాలో ఈ షో గురించి రెగ్యులర్‌గా లక్షల మంది మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల ఎపిసోడ్‌లో అపూర్వ మఖిజా చేసిన వ్యాఖ్యలు మరీ చెత్తగా ఉన్నాయి. తన కంటే చాలా పెద్ద వారు అయిన, తన తల్లిదండ్రుల కంటే పెద్ద వయసు ఉన్న ఆశిష్ విద్యార్థి ని గురించి చెత్త వ్యాఖ్యలను అపూర్వ చేసింది. ఆశిష్‌ గ్రౌండ్‌ లో నిద్ర పోతున్న సమయంలో తన కో కంటెస్టెంట్‌తో కలిసి మాట్లాడుతున్న సమయంలో ఆశిష్ విద్యార్థి గురించి ఆ చెత్త వ్యాఖ్య చేసింది.

ఇలాంటి షోల వల్ల యూత్‌ పాడై పోతారు అంటూ ఎప్పటి నుంచో కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా షో పై మరింత వ్యతిరేకత వస్తుంది. ఇలాంటి చెత్త నటీ నటుల కారణంగానే ఇండస్ట్రీ పరువు పోతుందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వయసుకు గౌరవం ఇచ్చి ఆయనను అలాంటి మాటలు అనుకుండా ఉండాల్సిందని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. అన్ని కెమెరాలు ఉన్నాయి, ఇది బయటకు వెళ్తుంది అని తెలిసి కూడా ఆమె ఆ వ్యాఖ్యలు చేసింది. కనుక ఆమె పబ్లిసిటీ పిచ్చితోనే అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటుందని కొందరు అంటున్నారు. మొత్తానికి ఆ రాయడానికి వీలు లేని మాట అనడం ద్వారా అపూర్వ చాలా పెద్ద తప్పు చేసిందని, షో తర్వాత అయినా ఆమె ఆశిష్‌కి క్షమాపణ చెబితే బాగుంటుంది అని కొందరు అంటున్నారు. మరి బయటకు వచ్చిన తర్వాత ఆ రెబల్‌ కిడ్‌ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.