Begin typing your search above and press return to search.

లండన్ లో కోహ్లి ఇంటి అడ్రస్ ఇదే.. ఇప్పుడు అక్కడే నివాసం

గతంలో కోహ్లి-అనుష్క దంపతులు చాలాసార్లు లండన్ లోనే టూర్ చేస్తూ కనిపించారు. ఆ తర్వాత వారి రెండో నివాసం లండన్ గా మారింది.

By:  Tupaki Desk   |   8 July 2025 7:00 PM IST
లండన్ లో కోహ్లి ఇంటి అడ్రస్ ఇదే.. ఇప్పుడు అక్కడే నివాసం
X

టీమ్ ఇండియా దిగ్గజం విరాట్ కోహ్లికి చాన్నాళ్ల నుంచి లండన్ రెండో సొంత నగరంగా మారిపోయింది.. కోహ్లి పక్కా ఢిల్లీ వాసి. ఢిల్లీలో పుట్టి పెరిగిన అతడు అనుష్కశర్మను వివాహం చేసుకున్నాక ముంబైకి మకాం మార్చాడు. కొన్నేళ్ల నుంచి ఎక్కువ శాతం లండన్ లోనే ఉంటున్నట్లు కథనాలు వచ్చాయి. అనుష్క రెండో కాన్పు అక్కడే జరిగింది. టోర్నమెంట్లు లేనప్పుడు కోహ్లి పూర్తిగా లండన్ కే పరిమితం అవుతున్నాడని కూడా టాక్. ఆ మధ్య చాంపియన్స్ ట్రోపీ గెలిచాక కూడా నేరుగా ఇండియాకు రాలేదు. లండన్ వెళ్లాడు.

ఐపీఎల్ చివర్లో టెస్టు క్రికెట్ కు.. తాను ఎంతో ఇష్టపడే ఇంగ్లండ్ టూర్ ముంగిట రిటైర్మెంట్ ప్రకటించాడు కోహ్లి. దీంతో క్రికెట్ ప్రపంచం విస్తుపోయింది. ఇక లీగ్ ముగిశాక కోహ్లి నేరుగా లండన్ వెళ్లినట్లు స్పష్టం అయింది. ఎలాగంటే.. గత నెల 18న లండన్ లోని తన ఇంటికి టీమ్ ఇండియా కొత్త కెప్టెన్ శుబ్ మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ను ఆహ్వానించాడు. వారితో కొన్ని గంటలు గడిపాడు.

గతంలో కోహ్లి-అనుష్క దంపతులు చాలాసార్లు లండన్ లోనే టూర్ చేస్తూ కనిపించారు. ఆ తర్వాత వారి రెండో నివాసం లండన్ గా మారింది. తాజాగా ఆ నగరంలో కోహ్లి ఇల్లు ఎక్కడో తెలిసింది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ లండన్ లో కోహ్లి ఇంటి చిరునామా చెప్పేశాడు. వీరు ఖరీదైన బంగ్లాలో నివిసిస్తున్నట్లు తెలుస్తోంది. నాటింగ్ హిల్ సెయింట్ జాన్స్ వుడ్ లో కోహ్లి-అనుష్క దంపతుల భవనం ఉన్నట్లు ట్రాట్ నోరు జారాడు.

కోహ్లికి భారత్ లో అభిమానునలు ఎక్కువ. ఈ కారణంగా వ్యక్తిగత జీవితం ఇబ్బందికరమే. బాలీవుడ్ నటిగా అనుష్కకూ ఫ్యాన్ బేస్ ఉంది. స్వేచ్ఛ లేకపోవడంతోనే ఈ జంట లండన్ ను తమ నివాసంగా ఎంచుకుంది. కోహ్లి రిటైర్మెంట్ అనంతరం అక్కడే స్థిరపడతాడనే కథనాలూ వచ్చాయి. బహుశా అవి పూర్తిగా నిజం కాకున్నా.. కోహ్లి ఎక్కువ రోజులు లండన్ లో ఉండే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి.