రోజుకు 600 బంతులు.. డాబాపై ప్రాక్టీస్.. క్రికెట్టే వైభవ్ జీవితం
14 ఏళ్లు.. సహజంగా పిల్లలు క్రికెట్ అకాడమీలకు వెళ్లే వయసు.. కానీ, ఈ వయసుకే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ మ్యాచ్ లు ఆడుతున్నాడు. ఆడడమే కాదు.. రికార్డు స్థాయిలో ఏకంగా సెంచరీ కూడా కొట్టేశాడు.
By: Tupaki Desk | 29 April 2025 4:45 PM ISTఅతడు పుట్టుకతోనే క్రికెటర్.. బాల్యం అంతా మైదానంలోనే.. టీనేజీకి వచ్చేసరికి స్టేడియమే అతడి స్నేహితుడు అయింది.. మొత్తంగా క్రికెట్టే అతడి జీవితం.. మీడియా, సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా అతడి గురించే.
14 ఏళ్లు.. సహజంగా పిల్లలు క్రికెట్ అకాడమీలకు వెళ్లే వయసు.. కానీ, ఈ వయసుకే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ మ్యాచ్ లు ఆడుతున్నాడు. ఆడడమే కాదు.. రికార్డు స్థాయిలో ఏకంగా సెంచరీ కూడా కొట్టేశాడు. దీంతో వైభవ్ కు సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆరేళ్ల పిల్లాడిగా..
వైభవ్ ఆరేళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు 2017లో అతడు అప్పటి పుణె సూపర్ జెయింట్స్ (పీఎస్జీ) మ్యాచ్ చూసేందుకు తండ్రితో కలిసి వచ్చాడు. ఇప్పటి రాజస్థాన్ రాయల్స్ రంగు అయిన పింక్ అప్పట్లో పుణెకు ఉండేది. అలా పింక్ కలర్ బ్యాండ్ ను తలకు కట్టుకున్న వైభవ్ ను అతడి తండ్రి ఎత్తుకున్న ఫొటో వైరల్ అవుతోంది.
10 ఏళ్ల బాలుడిగా..
వైభవ్ పదేళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు కోన్స్ పెట్టుకుని వాళ్ల ఇంటి డాబాపై బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. వీటితో పాటు తాజా సెంచరీ చేసిన సందర్భంలోని ఫొటోనూ యాడ్ చేసి మూడు సందర్భాలనూ అభిమానులు కంపేర్ చేస్తున్నారు.
టీమ్ ఇండియా అండర్-19లోకి
వైభవ్ సూర్య వంశీ త్వరలో ఇంగ్లండ్ లో పర్యటించే అండర్ 19 టీమ్ ఇండియాలోకి ఎంపికవడం ఖాయం అని అంటున్నారు. ఇతడితొ పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ గా రాణిస్తున్న 17 ఏళ్ల ఆయుష్ మాత్రేను కూడా ఈ టూర్ కు ఎంపిక చేయం పక్కా అని చెబుతున్నారు.
కాగా, వైభవ్ సొంత రాష్ట్రం బిహార్. ఆ రాష్ట్ర సీఎం నీతీశ్ కుమార్ తాజాగా రూ.10 లక్షల నగదు రివార్డు ప్రకటించారు.