Begin typing your search above and press return to search.

ఇట్స్‌ ఆర్సీబీ టైమ్‌.. చెన్నైని దాటేసి ఐపీఎల్‌ వాల్యుబుల్‌ టీమ్‌!

ఇక ఐపీఎల్‌ విలువ 18.5 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇది నిరుటి కంటే 12.9 శాతంఎక్కువ. దీంతో ప్రపంచంలోని అత్యంత విలువైన క్రీడా లీగ్‌లలో ఐపీఎల్‌ స్థానం మరింత సుస్థిరమైంది.

By:  Tupaki Desk   |   8 July 2025 10:29 PM IST
ఇట్స్‌ ఆర్సీబీ టైమ్‌.. చెన్నైని దాటేసి ఐపీఎల్‌ వాల్యుబుల్‌ టీమ్‌!
X

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)... ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఎట్టకేలకు 18వ సీజన్‌లో విజేతగా నిలిచిన టీమ్‌. అయితే, టైటిల్‌ కొట్టడమే కొలమానం కాదు అన్నట్లు ఆ జట్టుకు ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఈ విషయంలో ఐదుసార్లు ఐపీఎల్‌ విన్నర్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే), ముంబై ఇండియన్స్‌ (ఎంఐ)తో సమానంగా ఆర్సీబీ నిలుస్తుంది. ప్రధాన కారణం..టీమ్‌ ఇండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి. అలాంటి జట్టును లీగ్‌లో ఎన్నో ఏళ్లు దురదృష్టం వెంటాడింది. ఈ ఏడాది అయినా టైటిల్‌ దక్కుతుందా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీ చాంపియన్‌గా ఆవిర్భవించింది. అభిమానులు ఆనందంలో ముంచెత్తింది.

దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఏటేటా మరింత ఆదరణ పొందుతోంది. ఈసారి దానికి ఆర్సీబీ ఆకర్షణ కూడా తోడైంది. తాజాగా హౌలిహాన్‌ లోకే విడుదల చేసిన జాబితా ప్రకారం ఆర్సీబీ అత్యంత విలువైన ఐపీఎల్‌ ఫ్రాంచైజీగా నిలిచింది. అది కూడా సీఎస్కేను వెనక్కనెట్టి మరీ కావడం గమనార్హం. ఆర్సీబీ బ్రాండ్‌ విలువ నిరుడు 227 మిలియన్‌ డాలర్లు. ఈ ఏడాది అది ఏకంగా 269 మిలియన్‌ డాలర్లకు పెరిగింది.దీనికి కారణం.. టైటిల్‌ విజేతగా నిలవడమే అనుకోవాలి.

ఈ ఏడాది తొలుత వెనుకబడినా.. అద్భుతంగా పుంజుకొని ఎలిమినేటర్‌ వరకు వచ్చిన ముంబై ఇండియన్స్‌ 242 మిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. అయితే, కొన్ని సీజన్ల నుంచి ప్రదర్శన పడిపోవడం, ఈ సీజన్‌లో దారుణంగా ఆడడంతో సీఎస్కే బ్రాండ్‌ విలువ 235 మిలియన్‌ డాలర్లకు తగ్గింది.

ఇక ఐపీఎల్‌ విలువ 18.5 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇది నిరుటి కంటే 12.9 శాతంఎక్కువ. దీంతో ప్రపంచంలోని అత్యంత విలువైన క్రీడా లీగ్‌లలో ఐపీఎల్‌ స్థానం మరింత సుస్థిరమైంది. స్వతంత్ర బ్రాండ్ విలువ 13.8% పెరిగి 3.9 బిలియన్‌ డాలర్లకు (రూ.32,721 కోట్లు) చేరుకుంది. రికార్డు స్థాయిలో వీక్షకుల సంఖ్య, పెరుగుతున్న ప్రకటన ఆదాయాలు, బలమైన పెట్టుబడిదారుల ఆసక్తి దీనికి మూలం.

నిరుడు ఆర్సీబీ బ్రాండ్ విలువ 227 మిలియన్‌ డాలర్లు. చాంపియన్‌ కావడంతో ఈ ఏడాది అది ఏకంగా 269 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. 42 మిలియన్‌ డాలర్ల జంప్‌ అన్నమాట. ఎంతైనా ఇప్పుడు ఆర్సీబీ టైమ్‌ నడుస్తోంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ.