Begin typing your search above and press return to search.

సింహం ముస‌లిదైందని ఎలుక ఎక‌సెక్కాలు..సీఎస్కేతో స్టార్ స్పిన్న‌ర్ ఆట‌

చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే)కు ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే ఎదుర‌వుతోంది. ఇదంతా చూస్తుంటే సింహం ముస‌లిదైందని ఎలుక ఎక‌సెక్కాలు ఆడింద‌నే సామెత నిజ‌మేన‌ని అనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   12 Aug 2025 7:00 PM IST
సింహం ముస‌లిదైందని ఎలుక ఎక‌సెక్కాలు..సీఎస్కేతో స్టార్ స్పిన్న‌ర్ ఆట‌
X

ఉంచుతారా? వ‌దులుకుంటారా.. ఏదో ఒక‌టి తేల్చండి.... ఐదుసార్లు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) చాంపియ‌న్ అయిన జ‌ట్టును అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఓ క్రికెట‌ర్ బెదిరింపు ధోర‌ణిలో ప్ర‌శ్నిస్తే ఎలా ఉంటుంది...? చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే)కు ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే ఎదుర‌వుతోంది. ఇదంతా చూస్తుంటే సింహం ముస‌లిదైందని ఎలుక ఎక‌సెక్కాలు ఆడింద‌నే సామెత నిజ‌మేన‌ని అనిపిస్తోంది.

టీమ్ ఇండియాలో లేకున్నా...

ర‌విచంద్ర‌న్ అశ్విన్.. ఈ ఏడాది మొద‌ట్లోనే అంత‌ర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చాడు. వ‌న్డేలు, టి20ల‌కు టీమ్ ఇండియాలో చోటు కోల్పోయి చాలా ఏళ్ల‌యింది. అంత‌ర్జాతీయ‌ ప‌రిమిత ఓవ‌ర్ల ఫార్మాట్ (వ‌న్డేలు, టి20లు)కు అశ్విన్ ను ప‌క్క‌న‌పెట్టారు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్ర‌మే అత‌డు టి20లు ఆడుతున్నాడు. అయితే, చెన్నైకు చెందిన అశ్విన్ ను ఇప్ప‌టివ‌ర‌కు 5 జ‌ట్లు మారాడు.

తొలుత చెన్నైకే ఆడినా...

2009లో ఐపీఎల్ కెరీర్ మొద‌లుపెట్టిన అశ్విన్.. 2015 సీజ‌న్ వ‌ర‌కు చెన్నైకే ఆడాడు. 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ కు, 2018, 19లో పంజాబ్ కింగ్స్ కు, ప్రాతినిధ్యం వ‌హించాడు త‌ర్వాతి రెండు సీజ‌న్లు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు ఆడాడు. 2022 నుంచి మూడు సీజ‌న్లు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ఆడాడు. ఈ ఏడాది మాత్రం మ‌ళ్లీ చెన్నైకు వ‌చ్చాడు. 38 ఏళ్ల అశ్విన్ ను మెగా వేలంలో రూ.9.75 కోట్ల‌కు చెన్నై కొనుక్కుంది. 9 మ్యాచ్ లు ఆడినా పెద్ద‌గా రాణించ‌లేదు. అయినా, ఇప్పుడు అత‌డు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకుంటారో స్ప‌ష్ట‌త ఇవ్వండి అంటూ చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్రాంచైజీని కోరుతున్నాడు. జ‌ట్టు ప్లాన్ లో తాను ఫిట్ కాన‌ని భావిస్తే వెళ్లిపోతాన‌ని తెలిపాడు.

-ఈ ఏడాది న‌వంబ‌రు-డిసెంబ‌రులో ఐపీఎల్ మినీ వేలం జ‌ర‌గ‌నుంది. అందులో ఆట‌గాళ్ల బ‌దిలీ, విడుద‌లకు అవ‌కాశం ఉంటుంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ ను తీసుకుని అశ్విన్ ను రాజ‌స్థాన్ కు ఇవ్వాల‌ని చెన్నై భావిస్తున్న‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. లోగోలో సింహాన్ని పెట్టుకున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ కొన్ని సీజ‌న్లుగా దారుణంగా ఆడుతోంది. ఈ సీజ‌న్ లో మ‌రింత దారుణంగా ఆడింది. అయినా, అశ్విన్ డిమాండింగ్ చేస్తుండడం గ‌మ‌నార్హం.