Begin typing your search above and press return to search.

ఐపీఎల్ ఫ్రాంచైజీలంటే సీఎస్కే, జీటీలా ఉండాలి..రాహుల్ వ్యాఖ్యలు వైరల్

అలాంటివాడికి క్రికెట్ లో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలి అని ఏం తెలుస్తుంది? దీంతోనే మైదానంలోనే జట్టు అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ పై చిందులేశాడు

By:  Tupaki Desk   |   22 April 2025 9:00 PM IST
ఐపీఎల్ ఫ్రాంచైజీలంటే సీఎస్కే, జీటీలా ఉండాలి..రాహుల్ వ్యాఖ్యలు వైరల్
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో.. నిరుడు సరిగ్గా ఇదే రోజుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్.. అసలే నిదానంగా స్కోర్ చేసే జట్టుగా పేరున్న లక్నో.. మహా దూకుడుగా ఆడే సన్ రైజర్స్ హైదరాబాద్.. అంటే.. తాబేలు-కుందేలు కథ అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో తాబేలు లాంటి లక్నోను చిత్తు చిత్తు చేసింది కుందేలు హైదరాబాద్.

దీంతో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకాకు చిర్రెత్తింది.. అసలే వ్యాపారి. అలాంటివాడికి క్రికెట్ లో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలి అని ఏం తెలుస్తుంది? దీంతోనే మైదానంలోనే జట్టు అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ పై చిందులేశాడు. ఆ తర్వాత అందరికీ తెలిసింది ఏమంటే రాహుల్ ఇకపై ఆ జట్టుతో కొనసాగడమని. వీరిద్దరి మధ్య చర్చలు జరిగినా చివరకు అవి ఫలవంతం కాలేదు. రాహుల్ ను లక్నో రిటైన్ చేసుకోలేదు. ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ కు రూ.27 కోట్ల రికార్డు ధర పెట్టింది. కెప్టెన్ ను చేసింది.

ఇప్పుడు రాహుల్ ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ చక్కగా ఆడుతున్నాడు. ఢిల్లీ టేబుల్ లో టాప్-2లో ఉంటోంది. ఇక రాహుల్ కూడా తనకు లక్నోతో ఎదురైన చేదు అనుభవాన్ని మర్చిపోలేకపోతున్నాడేమో? తాజాగా ఆ జట్టును ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశాడు.

ఫ్రాంచైజీలు అంటే గుజరాత్ టైటాన్స్ (జీటీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)లా ఉండాలి. గెలిచినా ఓడినా సమంగా స్వీకరిస్తాయి. లక్నో నన్ను రిటైన్ చేసుకోని తర్వాత ఫ్రెష్ గా స్టార్ చేయాలని భావించా. ఫ్రీడం కోరుకున్నా. అది ఉన్న చోటుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. అలాగైతేనే ఆటగాళ్లు కంఫర్ట్ గా ఫీలవుతారు’’ అని వ్యాఖ్యానించాడు.

దీన్నిబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే.. రాహుల్ లక్నో ఫ్రాంచైజీలో ఉక్కపోత అనుభవించాడని. అక్కడంతా సంజీవ్ గోయెంకా పెత్తనమే సాగేదని. అందుకే ఇప్పుడు తన కసినంతా బయటపెడుతూ ఆ జట్టును దెప్పి పొడిచాడు.