Begin typing your search above and press return to search.

ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు అవకాశాలు ఎంత..? శాతాల్లో చూస్తే..

మొదటి మ్యాచ్ లో మహా దూకుడు చూపిన రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్, డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ గురించి మంచి అంచనాలే పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   29 April 2025 9:28 PM IST
IPL 2025 Playoffs Race: RCB on Fire
X

మొదటి ఐదు మ్యాచ్ లలో ఒక్కటే గెలిచిన ముంబై ఇండియన్స్ పని అయిపోయింది అని అన్నారు..

మొదటి మ్యాచ్ లో మహా దూకుడు చూపిన రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్, డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ గురించి మంచి అంచనాలే పెట్టుకున్నారు.

మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఎలాగైనా పుంజుకుంటుందని భావించారు.. కొత్త కెప్టెన్ల సారథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ అద్భుతాలు చేస్తాయని ఆశలు పెట్టుకున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ సగంపైగానే ముగిసింది.. మరిప్పుడు ఏ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయి? అని చూస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి మాత్రమే టేబుల్ టాపర్ గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎన్నడూ లేని విధంగా ఈసారి దూకుడు చూపుతోంది.

ఒక్కసారి కూడా టైటిల్ ఫేవరెట్ అనిపించుకోని ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపుంతోంది..

ఒక్కసారి గేర్ అందుకుంటే వెనక్కుచూడని ముంబై ఇండియన్స్ మళ్లీ చాంపియన్ కావడం ఖాయం అనిపిస్తోంది. కుర్రాళ్లతో కూడిన గుజరాత్ టైటాన్స్ తమకు ఎదురులేదని చాటుతోంది. ఓ అంచనా ప్రకారం ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరేది ఎవరు? ఎవరి అవకాశాలు ఎంత శాతం? అంటే..

బెంగళూరు 91, గుజరాత్ 79, ఢిల్లీ 76, ముంబై 65, పంజాబ్ 60 శాతంలో ముందంజలో ఉన్నాయి. టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ను రూ. 27 కోట్లకు కొన్న లక్నో సూపర్ జెయింట్స్ 21 శాతంతో దాదాపు రేసు నుంచి తప్పుకొన్నట్లే.

డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా 6 శాతం, సన్ రైజర్స్ 0.2, చెన్నై 0.04 శాతంతో పూర్తిగా పక్కకు వెళ్లిపోయాయి.