Begin typing your search above and press return to search.

భారత్ – పాక్ మ్యాచ్... ఎమిరేట్స్ క్రికెట్ నుంచి కీలక అప్ డేట్!

ఈ సందర్భంగా స్పందించిన సుభాన్ అహ్మద్... భారత్ - పాక్‌ మ్యాచ్‌ కు ఎలాంటి అంతరాయం ఉండదని చెబుతున్నా అని మొదలుపెట్టి... అయితే, దీనిపై అధికారిక హామీ ఇవ్వమంటే ఇప్పుడే ఇవ్వలేను అని అన్నారు.

By:  Raja Ch   |   9 Aug 2025 7:40 PM IST
భారత్ – పాక్  మ్యాచ్... ఎమిరేట్స్  క్రికెట్  నుంచి కీలక అప్  డేట్!
X

ఇండియా – పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్... ఈ పదం ఒక కిక్కు, కొన్ని కోట్ల మందిని టీవీల ముందు కట్టేసే మత్తు అనే సంగతి తెలిసిందే. అయితే... పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఇకపై ఆ కిక్కు, అలాంటి మత్తుకు ఆస్కారం లేదనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ కామెంట్లకు ఇటీవల జరిగిన ‘ప్రపంచ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ టోన్రీ’లో టీమిండియా ఛాంపియన్స్ బహిష్కరించడంతో బలపడింది.

ఆ నిర్ణయంపై భారత క్రికెట్ అభిమానుల్లో హర్షం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 9 నుంచి ‘ఆసియా కప్’ లో టీమిండియా బరిలోకి దిగాల్సి ఉంది. అక్కడ పాకిస్థాన్ తో తలపడాల్సి ఉంది. అయితే... ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్ పై సందిగ్ధత నెలకొంది. ఈ సమయంలో ఎమిరేట్స్ క్రికెట్ అసోసియేషన్ నుంచి కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.

అవును.. ఆసియా కప్ లో పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో టీమిండియా ఆడబోతుందా లేదా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ.. మరోవైపు, అంతర్జాతీయ వేదికలపై పాక్‌ తో ఆడేందుకు తాము ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన నేపథ్యంలో.. దాయాదుల మధ్య పోరుకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని ఎమిరేట్స్ క్రికెట్ అసోసియేషన్ సీవోవో సుభాన్ అహ్మద్ వెల్లడించారు.

ఈ సందర్భంగా స్పందించిన సుభాన్ అహ్మద్... భారత్ - పాక్‌ మ్యాచ్‌ కు ఎలాంటి అంతరాయం ఉండదని చెబుతున్నా అని మొదలుపెట్టి... అయితే, దీనిపై అధికారిక హామీ ఇవ్వమంటే ఇప్పుడే ఇవ్వలేను అని అన్నారు. ఇదే సమయంలో... వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్ ఆఫ్‌ లెజెండ్స్‌ అనేది ప్రైవేట్ లీగ్ అని.. కాని, ఆసియా కప్‌ అంతర్జాతీయ జట్లు తలపడే టోర్నీ అని.. ఈ రెండింటికీ పోలికే లేదని అన్నారు. దీంతో మ్యాచ్ జరగొచ్చా అనే చర్చ మొదలైంది!

కాగా... యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఆసియా కప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత్, పాక్ ఒకే గ్రూప్‌ లో తలపడుతున్నాయి. ఈ క్రమంలో... లీగ్‌ స్టేజ్‌ లోనే కాకుండా, పాయింట్ల పట్టిక ఆధారంగా సూపర్ 4 దశలోనూ మరోసారి ఈ దేశాల మధ్య పోరు జరిగే అవకాశం ఉంది!

దీంతో... బీసీసీఐ తీరుకోబే నిర్ణయం ఆసక్తిగా మారింది. ఇక ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌ లో జరగనున్న సంగతి తెలిసిందే. టీ20 జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహిస్తున్నాడు.