Begin typing your search above and press return to search.

ఎడ్జ్ బాస్టన్ లో రికార్డులతొో తొలి విజయం..చరిత్ర తిరగరాసిన టీమ్ఇండియా

ఐదో రోజు ఇంగ్లండ్ ఏడు వికెట్లు తీయడానికి టీమ్ ఇండియా కాస్త శ్రమించింది. వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం కావడంతో మన జట్టు గెలుస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

By:  Tupaki Desk   |   7 July 2025 8:57 AM IST
ఎడ్జ్ బాస్టన్ లో రికార్డులతొో తొలి విజయం..చరిత్ర తిరగరాసిన టీమ్ఇండియా
X

ఇప్పటివరకు 8 టెస్టులు ఆడితే ఒక్కదాంట్లోనూ గెలవలేదు.. ఒక్కటే డ్రా.. ఏడు ఓటములు... ఈ రికార్డుతో ఎడ్జ్ బాస్టన్ లో రెండో టెస్టు బరిలో దిగిన టీమ్ ఇండియా రికార్డును తిరగరాస్తూ తొలి గెలుపును సొంతం చేసుకుంది. 608 పరుగుల అత్యంత భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ కు దిగిన ఇంగ్లండ్ ను కేవలం 271 పరుగులకు ఆలౌట్ చేసింది. 336 పరుగుల భారీ తేడాతో విజయం సొంతం చేసుకుంది. విదేశాల్లో భారత జట్టుకు పరుగుల పరంగా ఇదే అత్యంత భారీ విజయం. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను 1-1తో సొంతం చేసుకుంది.

ఐదో రోజు ఇంగ్లండ్ ఏడు వికెట్లు తీయడానికి టీమ్ ఇండియా కాస్త శ్రమించింది. వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం కావడంతో మన జట్టు గెలుస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే, మ్యాచ్ ప్రారంభం అయిన కాసేపటికే ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ ఓలీ పోప్, హ్యారీ బ్రూక్ లను పేసర్ ఆకాశ్ దీప్ అద్భుత బంతులతో ఔట్ చేశాడు. దీంతో ఐదు వికెట్లు కోల్పోయింది. ఆపై కెప్టెన్ స్టోక్స్ ను ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జేమీ స్మిత్ (88) మరోసారి అడ్డుగోడగా నిలిచినా అతడిని ప్రసిద్ధ్ క్రిష్ణ ఔట్ చేశాక ఇంగ్లండ్ కథ ముగిసింది.

-ఎడ్జ్ బాస్టన్ మైదానంలో, కెప్టెన్ గా శుబ్ మన్ గిల్ కు ఇది తొలి విజయం.

-ఈ మ్యాచ్ లో ఆకాశ్ దీప్ పది వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో 4, రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు పడగొట్టాడు.

-ఈ మ్యాచ్ లో కెప్టెన్ శుబ్ మన్ గిల్ 430 (269, 161) పరుగులు చేశాడు.

-సిరాజ్, ప్రసిద్ధ్, సుందర్, జడేజా తలో వికెట్ తీశారు.

-తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా 587, ఇంగ్లండ్ 407 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ ను భారత్ 427/6 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ కు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. 271 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది.

-మూడో టెస్టు ఈ నెల 10 నుంచి జరగనుంది.