Begin typing your search above and press return to search.

ఒక్క రోజులో 536.. ఇంగ్లండ్ కొట్టేస్తుందా? వాళ్ల కోచ్ మాట ఇదే...

కానీ, టెస్టుల్లోనూ బజ్ బాల్ వ్యూహంతో చెలరేగిపోతోంది. ఒక్క రోజులో 400 కొట్టేయగలం సులువుగా అని నిరూపిస్తోంది.

By:  Tupaki Desk   |   6 July 2025 4:05 PM IST
ఒక్క రోజులో 536.. ఇంగ్లండ్ కొట్టేస్తుందా? వాళ్ల కోచ్ మాట ఇదే...
X

90 ఓవర్లు... ఒక్క రోజులో 400.. టెస్టులో ఈ స్కోరు కొట్టడం కష్టమే.. సంప్రదాయ ఫార్మాట్ లో వికెట్లు కోల్పోకుండా ఉండడం ముఖ్యం.. పది ఓవర్లలో 100 కొట్టి.. మొదటి నాలుగు కీలక వికెట్లు నష్టపోతే.. మిగతా 80 ఓవర్లు ఆడేందుకు ఇబ్బంది వస్తంది.. అందుకే, టెస్టుల్లో ఆచితూచి ఆడడం ముఖ్యం.

కానీ, టెస్టుల్లోనూ బజ్ బాల్ వ్యూహంతో చెలరేగిపోతోంది. ఒక్క రోజులో 400 కొట్టేయగలం సులువుగా అని నిరూపిస్తోంది. తాజాగా భారత్ తో జరిగిన తొలి టెస్టులో 378 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించేసింది. మరి ఇప్పుడు రెండో టెస్టులో పరిస్థితి ఏమిటి..?

టాస్ గెలిచిన బ్యాటింగ్ కు దిగిన జట్టు 400 కొట్టడం సులువే.. అదే ముందు బౌలింగ్ చేసిన జట్టుకు కాస్త కష్టం. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఏ జట్టుకైనా 400 కొట్టడం ఇంకా కష్టం. ఛేజింగ్ లో అయితే ఇంగ్లండ్ తరహాలో ఆడితే తప్ప దాదాపు అసాధ్యమే. ఇప్పుడు టీమ్ ఇండియా –ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఏం జరగనుంది?

608 పరుగుల భారీ టార్గెట్.. ఏ జట్టుకైనా ఊహించనంత స్కోరు. అందులోనూ మూడు కీలక వికెట్లు కోల్పోయాక అంటే ఇక కష్టమే.

అయితే, తొలి టెస్టులో ఇలానే వికెట్లు పడినా.. దాదాపు 400 పరుగుల టార్గెట్ ను కొట్టేసింది ఇంగ్లండ్. మరిప్పుడు రెండో టెస్టులో ఏం చేస్తుంది? ఆదివారం చివరి రోజు ఇంకా 536 పరుగులు చేయాల్సి ఉంది. మరి ఆచితూచి ఆడి డ్రా చేసుకుంటుందా? బజ్ బాల్ తో చెలరేగి 536 పరుగులు కొట్టేస్తుందా? ఈ విషయమై ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ స్పందించాడు. అయితే, ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ చెప్పినదానికి భిన్నంగా అతడు మాట్లాడాడు.

శనివారం భారత్ నిర్దేశించిన ఎంతటి టార్గెట్ ను అయినా ఛేదిస్తామని చెప్పాడు బ్రూక్. ట్రెస్కోథిక్ మాత్రం.. ఇప్పుడ డ్రా కోసమే ఆడతామని స్పష్టం చేశాడు. అత్యంత భారీ టార్గెట్ ముందు ఉన్నదని.. అది తమకు తెలుసని పేర్కొన్నాడు. టీమ్ ఇండియా 550 పరుగుల టార్గెట్ ఇస్తుందని భావిస్తే.. 600 పైగా టార్గెట్ పెట్టిందని తెలిపాడు.

టీమ్ ఇండియా ఎడ్జ్ బాస్టన్ లో తొలి గెలుపు సాధించాలంటే ఇంగ్లండ్ ఏడు వికెట్లు పడగొట్టాలి. ఇంగ్లండ్ డ్రా కోసం ఆడకుండా అటాకింగ్ బౌలింగ్ చేయాలి. అయితే, ఆదివారం వర్షం ప్రభావం ఉండే అవకాశం ఉంది.