హైదరాబాద్ లోనే అత్యంత ఎత్తైన భవనంలో అంతస్తులెన్ని?
ఈ ప్రాజెక్టులో ఒక్కో అంతస్తుకు ఒక ఫ్లాట్.. స్కై విల్లాస్ లాంటి స్పెషాలిటీలకు కొదవ లేదు. ప్రస్తుతం ఈ భవనం తుది మెరుగులు దిద్దుతున్నారు.
By: Tupaki Desk | 27 April 2025 9:54 AM ISTనిర్మాణ రంగంలో దూసుకెళుతోంది హైదరాబాద్ మహానగరం. దేశీయంగా మిగిలిన నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ జోరు ఒక రేంజ్ లో ఉంది.అయితే.. గడిచిన రెండేళ్లుగా నగర రియల్ ఎస్టేట్ సానుకూలంగా లేకపోవటం.. ఇటీవల కాలంలో రికవరీ మోడ్ లోకి వెళుతున్న వైనం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. హైదరాబాద్ మహానగరంలో అత్యంత ఎత్తైన భవనం ఏది? అన్న ప్రశ్న వేస్తే.. సమాధానం ఇట్టే వచ్చేస్తుంది.
ఈ ఎత్తైన భవనం హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులోనే ఉంది. కొన్నేళ్ల క్రితం నిర్మాణం షురూ చేసి.. ఇప్పటికి కంటిన్యూ అవుతున్న ‘సాస్ క్రౌన్’ పేరుతో దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 57 అంతస్తుల్లో ఉండే ఈ భారీ భవనాన్ని నాలుగైదు ఎకరాల్లో నిర్మించారు. ఇది ఐటీ కారిడార్ లోనే కాదు.. హైదరాబాద్ మహానగరం మొత్తానికే ల్యాండ్ మార్క్ గా మారనుంది.
ఈ ప్రాజెక్టులో ఒక్కో అంతస్తుకు ఒక ఫ్లాట్.. స్కై విల్లాస్ లాంటి స్పెషాలిటీలకు కొదవ లేదు. ప్రస్తుతం ఈ భవనం తుది మెరుగులు దిద్దుతున్నారు. కేసీఆర్ హయాంలో ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం మొదలైంది. అప్పట్లోనే హాట్ టాపిక్ గా మారిన ఈ నిర్మాణం ఇప్పుడు చివరకు వచ్చేసింది. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. అయితే.. ఈ ఎత్తైన భవనం ట్యాగ్ మరికొద్ది నెలల్లోనూ దూరం కానుంది.
దీనికి కారణం 62 అంస్తులతో మరో భవనాన్ని త్వరలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆ భవనం.. నిర్మాణ అనుమతుల దశలోనే ఉంది. అదంతా పూర్తి అయ్యేందుకు కనీసం ఐదారేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటివరకు సాస్ క్రౌనే అత్యంత ఎత్తైన నిర్మాణంగా నిలవనుంది. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలో నిర్మిస్తున్న నిర్మాణాలపై ఆసక్తికర అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దేశంలో నిర్మిస్తున్న ఆకాశ హర్మ్యాల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబయి తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచిందని పేర్కొంటున్నారు.