Begin typing your search above and press return to search.

అమెరికాలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి!

మే 10, శనివారం, అమెరికాలోని పెన్సిల్వేనియాలోని లాంక్ స్టర్ కౌంటీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By:  Tupaki Desk   |   13 May 2025 11:03 AM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం...  ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి!
X

మే 10, శనివారం, అమెరికాలోని పెన్సిల్వేనియాలోని లాంక్ స్టర్ కౌంటీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒహియోలోని క్లీవ్ ల్యాండ్ లో నివసిస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సౌరవ్ ప్రభాకర్ (23), మానవ్ పటేల్ (20) అని స్థానిక అధికారులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఘటనా స్థలంలోనే మరణించినట్లు ప్రకటించారు.

అవును... పెన్సిల్వేనియాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. ఈ ప్రమాదం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బెక్ నాక్ టూన్షిప్ లోని 286.5 మైలు సమీపంలో జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన పెన్సిల్వేనియా రాష్ట్ర పోలీసులు.. కారు రోడ్డు పక్కన అదుపు తప్పి, చెట్టును ఢీకొట్టి, ఆపై వంతెనను ఢీకొట్టిందని తెలిపారు.

ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అత్యవసర బృందాలు అక్కడికి చేరుకున్నాయని.. అయితే, దురదృష్టవశాత్తు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన కాన్సులేట్ మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

ఇందులో భాగంగా... క్లీవ్‌ ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మానవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్ ప్రాణాలు కోల్పోయిన దురదృష్టకర రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాము.. ఈ క్లిష్ట సమయంలో కాన్సులేట్ కుటుంబాలతో సన్నిహితంగా ఉంది.. వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చింది.