Begin typing your search above and press return to search.

ఇండియాకి తిరిగి వెళ్లిపో.....ఐర్లాండ్ లో ఆరేళ్ల భారత చిన్నారిపై దాడి!

చిన్నారి ముఖంతో పాటు ఆమె వ్యక్తిగత అవయవాలపై కూడా కొంతమంది దుండగులు కొట్టడం అమానవీయమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.

By:  Madhu Reddy   |   7 Aug 2025 3:30 PM IST
ఇండియాకి తిరిగి వెళ్లిపో.....ఐర్లాండ్ లో ఆరేళ్ల భారత చిన్నారిపై దాడి!
X

ఈ మధ్యకాలంలో చిన్నారులపై లైంగిక దాడులు అందరిలో భయాందోళనకు గురి చేస్తుంటే.. ఇప్పుడు ఒక చిన్నారిపై జరిగిన దాడి మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కనీ విని ఎరుగని రీతిలో నేటితరం బాలలు చేసిన పని సిగ్గుచేటు అంటూ పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఐర్లాండ్ లోని భారత పౌరులపై ఇప్పుడు భౌతిక దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆరు సంవత్సరాల చిన్నారిపై జాత్యాహంకార దాడి జరిగింది. చిన్నారి ముఖంతో పాటు ఆమె వ్యక్తిగత అవయవాలపై కూడా కొంతమంది దుండగులు కొట్టడం అమానవీయమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన బాధిత బాలిక కుటుంబం గత ఎనిమిది సంవత్సరాలుగా ఐర్లాండ్ లోనే నివసిస్తున్నారు. వీరికి ఐరిష్ పౌరసత్వం కూడా లభించింది. అక్కడే చిన్నారి తల్లి నర్సుగా పనిచేస్తోంది. తాము నివసిస్తున్న వీధిలో తన కూతురిపై జరిగిన ఆ అమానవీయ ఘటనను ఆమె మీడియాతో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. "ఈనెల 4వ తేదీన నా కూతురు కొంతమందితో కలిసి ఇంటి బయట ఆడుకుంటుండగా.. 12- 14 సంవత్సరాల మధ్య వయసున్న కొంతమంది అబ్బాయిలు నా కూతురిపై దాడి చేశారు." ఇండియాకి తిరిగి వెళ్లిపో" అంటూ జాత్యహంకార దూషణలు చేశారు. అక్కడితో ఆగకుండా ఆమె ముఖంపై కొట్టడం, ఆమె వ్యక్తిగత అవయవాలపై కూడా దాడి చేశారు.వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూనే ఉండిపోయింది. ఈ ఘటనతో నా కూతురు చాలా భయపడి పోయింది. నేను 10 నెలల నా కుమారుడికి ఇంట్లో ఆహారం తినిపిస్తూ ఉండగా ఇదంతా జరిగింది. దీనిని చూస్తుంటే ఇక్కడ మాకు సురక్షితంగా అనిపించడం లేదు".. అంటూ ఆమె తెలిపారు.

అంతేకాదు బయట జరుగుతుంటే.. ఈ ఘటన తనకు తెలియలేదని ఈ ఘటన తమను తీవ్రంగా కలిచివేసింది అని ఆమె బాధపడ్డారు. అంతేకాదు తన కూతురిపై జరిగిన ఈ దాడిని ఆపలేకపోయానని తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనిపై ఫిర్యాదు చేశానని అయితే వారికి శిక్ష విధించడం కంటే ముందు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరినట్లు కూడా ఆమె తెలిపారు. అయితే ఇది విన్న నెటిజన్లు మాత్రం నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జనరేషన్లో కూడా జాతి, కులం, మతం, వర్గం గురించి ఆలోచించడం ఏంటి? అసలు ఈ పిల్లలు ఏ జనరేషన్లో ఉన్నారు..? మీరు ఇలా ప్రవర్తించడం వెనక అసలు కారణం ఏమిటి? అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు రావడానికి గల కారణం ఇటీవల ఐర్లాండ్లో భారతీయులపై జాత్యహంకార దాడులు జరగడమే ప్రధాన కారణం అని తెలుస్తోంది. జూలై 19న డబ్లిన్ శివారులోని తల్లాగ్ట్ లో డాక్టర్ సంతోష్ యాదవ్ అనే భారత పౌరుడిపై కొంతమంది స్థానిక యువకులు ఇలా జాతిని ఉద్దేశించి దాడికి దిగారు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు.. ఈ ఘటన మరువక ముందే ఇప్పుడు చిన్నారిపై కూడా ఇలా జాతి పేరిట దాడులు చేయడం నిజంగా బాధాకరమని చెప్పాలి. ప్రస్తుతం ప్రతికూల సమయాలలో నిర్జన ప్రదేశాలకు వెళ్లొద్దని, భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఐర్లాండ్ లోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులకు సూచించింది.