Begin typing your search above and press return to search.

ట్రంప్ నిర్ణయాన్ని అడ్డుకున్న కోర్టు.. విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్!

హార్వర్డ్ యూనివర్శిటీ అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని నిషేధిస్తూ డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Jun 2025 9:35 AM IST
ట్రంప్  నిర్ణయాన్ని అడ్డుకున్న కోర్టు.. విదేశీ విద్యార్థులకు  గుడ్  న్యూస్!
X

హార్వర్డ్ యూనివర్శిటీ అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని నిషేధిస్తూ డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ వర్సిటీ, స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (ఎస్.ఈ.వీ.పీ) కింద అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హక్కును కోల్పోయింది! ఈ సమయంలో ట్రంప్ కు కోర్టు షాకిచ్చింది.

అవును... హార్వర్డ్ యూనివర్శిటీ అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని నిషేధిస్తూ ట్రంప్ సర్కార్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. యూనివర్సిటీలో డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కొనసాగిస్తోన్న దర్యాప్తులో భాగంగా ఈ నిర్ణయమని తెలిపింది. దీంతో... వ్యవహారం న్యాయస్థానానికి చేరింది.

ఈ నేపథ్యంలో హార్వర్డ్ యూనివర్సిటీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జారీ చేసిన ఆదేశాలను ఫెడరల్‌ న్యాయమూర్తి తాజాగా అడ్డుకున్నారు. ఈ అంశంలో తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు విదేశీ విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం హార్వర్డ్‌ కు ఉందని బోస్టన్‌ లోని డిస్రిక్ట్‌ జడ్జి అలిసన్‌ బరోస్‌ స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై హార్వర్డ్‌ కు అన్ని చట్టపరమైన హక్కులను కల్పించలేదు.

కాగా... రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ విదేశీ ఉద్యోగులతో పాటు అంతర్జాతీయ విద్యార్థులను టార్గెట్ చేసి పాలన సాగిస్తున్నట్లు కనిపిస్తున్న ట్రంప్.. ఇప్పటికే చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకునే విదేశీయులైన మధ్యతరగతి విద్యార్థులను టార్గెట్ చేసి, బహిష్కరణ నిర్ణయాల వరకూ వెళ్లారు.

ఇదే సమయంలో... హార్వర్డ్ వర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేశారు! ఈ మేరకు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్.. వర్సిటీకి లేఖ పంపారు. దీంతో... హార్వర్డ్స్ లో అడ్మిషన్స్ పొందిన భారతీయులు సహా, విదేశీ విద్యార్థులు మరో వర్సిటీకి బదిలీకావాల్సి ఉంటుంది. అలాకానిపక్షంలో.. అమెరికాలో చట్టపరమైన హోదా కోల్పోయే ప్రమాదం ఉంది.

ప్రస్తుత ఏడాది హార్వర్డ్స్ లో 6,800 మంది విదేశీ విద్యార్థులు నమోదు చేసుకున్నారు. అంటే.. యూనివర్శిటీలోని మొత్తం విద్యార్థుల్లో ఈ సంఖ్య 27%. వీరిలో ఎక్కువమంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక వీరిలో భారతీయ విద్యార్థుల సంఖ్య 788! ఈ క్రమంలో.. ట్రంప్ నిర్ణయంతో వీరి భవితవ్యం గందరగోళంలో పడింది! ఈ నేపథ్యంలో కోర్టు ట్రంప్ ఆదేశాలను తాజాగా అడ్డుకుంది!