Begin typing your search above and press return to search.

లాయ‌ర్ దంప‌తుల హ‌త్య కేసు సీబీఐకి.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు

ఇటీవ‌లి కాలంలో ఎన్న‌డూ లేని విధంగా తెలంగాణ‌కు సంబంధించిన ఓ దారుణ హ‌త్య కేసును సుప్రీంకోర్టు అనూహ్యంగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్ప‌గించింది.

By:  Tupaki Desk   |   12 Aug 2025 2:56 PM IST
లాయ‌ర్ దంప‌తుల హ‌త్య కేసు సీబీఐకి.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు
X

ఇటీవ‌లి కాలంలో ఎన్న‌డూ లేని విధంగా తెలంగాణ‌కు సంబంధించిన ఓ దారుణ హ‌త్య కేసును సుప్రీంకోర్టు అనూహ్యంగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్ప‌గించింది. రాజకీయంగా క‌ల‌క‌లం రేపిన ఈ కేసు తెలంగాణ‌లో నాలుగున్న‌రేళ్ల కింద‌ట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో దారుణ హ‌త్య‌కు గురైన ఇద్ద‌రూ న్యాయ‌వాద‌ దంప‌తులు కావ‌డం గ‌మ‌నార్హం. అప్ప‌ట్లో తెలంగాణ‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. అయితే, ఈ కేసులో సీబీఐ ద‌ర్యాప్తున‌కు త‌మ‌కేమీ అభ్యంత‌రం లేద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక తెలిపింది. దీంతో సుప్రీంకోర్టు.. కేసును సీబీఐకి అప్ప‌గిస్తూ సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది.

కారులో వెళ్తుండ‌గా.. దారికాచి...

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన న్యాయ‌వాద దంప‌తులు గ‌ట్టు వామ‌నరావు, నాగ‌మ‌ణి. ప‌లు వివాదాస్ప‌ద కేసుల‌ను వీరు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ప‌లువురితో వివాదాలు ఏర్ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో 2021 ఫిబ్ర‌వ‌రి 17న పెద్ద‌ప‌ల్లి జిల్లా క‌ల్వ‌చ‌ర్ల వ‌ద్ద కారులో వెళ్తుండ‌గా.. వీరిని అడ్డ‌గించి దారుణంగా హ‌త్య చేశారు. నాటి బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలోని ఓ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుడిపై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే, త‌మ కుమారుడి హ‌త్య కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని వామ‌న‌రావు తండ్రి సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ వ్యాజ్యం విచార‌ణ చేప‌ట్టిన సుప్రీం... అన్ని అంశాల‌ను ప‌రిశీలించిన ద‌ర్యాప్తు చేయాల‌ని సీబీఐని ఆదేశించింది.

-న్యాయ‌వాదులైన వామ‌న‌రావు దంప‌తుల దారుణ హ‌త్య అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నం రేపింది. న్యాయ‌వాద సంఘాలు దీనిని గ‌ట్టిగా ప్ర‌శ్నించాయి. అయితే, కొంత స్థానికంగా ఉన్న ప‌రిస్థితులు కూడా దంప‌తుల దారుణ హ‌త్య‌ల‌కు కార‌ణ‌మ‌య్యాయ‌నే అభిప్రాయాలు వినిపించాయి. చివ‌ర‌కు ఇప్పుడు సీబీఐ ఏం తేలుస్తుందో చూడాలి. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక వామ‌న‌రావు దంప‌తుల హ‌త్య కేసును సీబీఐ దర్యాప్తునకు ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని స్ప‌ష్టం చేసింది. ఇంకోవైపు వామ‌న‌రావు దంప‌తుల మరణ వాంగ్మూలం వీడియో ఒరిజిన‌ల్ అని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) నివేదిక తేల్చింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.