బాలురపైనే ఎక్కువ లైంగికదాడులు.. ఢిల్లీ కోర్టు సంచలన విషయాలు..
మైనర్లపై లైంగికదాడుల విషయంలో ఢిల్లీలోని సాకేత్ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక మైనర్ బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి 15 సంవత్సరాల కారగార శిక్ష విధించింది.
By: Tupaki Desk | 12 Aug 2025 2:58 PM ISTమైనర్లపై లైంగికదాడులు జరిగితే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. అయితే సమాజంలో లైంగికదాడుల ఘటనలో ఎక్కువగా బాలికలే బాధితులు అవుతారు. ఈ చట్టం కేవలం అమ్మాయిలపై దాడి జరిగితేనే ఉపయోగిస్తారన్న అపోహ ఇప్పటికీ సమాజంలో ఉంది. ఇందులో లింగ వివక్ష లేదని ఇటీవల న్యాయమూర్తి స్పష్టం చేశారు.
సాకేత్ కోర్టు సంచలన వ్యాఖ్యలు..
మైనర్లపై లైంగికదాడుల విషయంలో ఢిల్లీలోని సాకేత్ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక మైనర్ బాలుడిపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి 15 సంవత్సరాల కారగార శిక్ష విధించింది. ఈ కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి అను అగర్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలపైనే కాకుండా అబ్బాయిలపై కూడా లైంగికదాడులు జరుగుతున్నాయని, అమ్మాయిలపైనే జరుగుతున్నాయన్నది అపోహ మాత్రమేనని. బాధితుల్లో అబ్బాయిలు కూడా ఉన్నారన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పోక్సోకు లింగ వివక్ష లేదన్న న్యాయమూర్తి..
న్యాయమూర్తి అను అగర్వాల్ తీర్పులో భాగంగా ‘పోక్సో’ గురించి వివరించారు. ఈ చట్టం ఎటువంటి లింగవివక్ష చూపదని, బాలికలతో పాటు బాలురపై దాడులు చేసినా ఇది వర్తిస్తుందని చెప్పారు. 18 సంవత్సరాల్లోపు ఉన్న ప్రతి ఒక్క మైనర్ కు ఇది వర్తిస్తుందని వివరించారు. అంతెందుకు లైంగికదాడి ఘటనల్లో ఎక్కువ మంది అబ్బాయిలే అని విచారం వ్యక్తం చేశారు.
కేసు గురించి..
మైనర్ బాలుడిపై లైంగికదాడి చేసిన వ్యక్తికి 15 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సాకేత్ కోర్టు తీర్పు వెలువరించింది. 2019లో జరిగిన దాడికి సంబంధించిన కేసు తీర్పు చెప్పారు. లైంగిక వేధింపులు అంటే అందరూ అమ్మాయిలపైనే అని అనుకుంటారు. ఆ కేసులు ఉండచ్చు.. కానీ బాలురపై కూడా జరుతాయని అన్నారు. ఈ కేసులో ప్రభుత్వం తరుఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేవీ అరుణ్ వాదించారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ఈ నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. బాలల లైంగిక బాధితుల లెక్కల ప్రకారం.. 54.68 శాతం మంది అబ్బాయిలపై దాడులు జరుగుతున్నట్లు తేలింది. ఈ ఘనాంకాలు సమాజ అపోహకు భిన్నంగా ఉండడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అబ్బాయిలు కూడా మానసిక వేధనకు గురవుతారు..
బాధిత అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా మానసిక వేదనకు గురవుతారని కోర్టు పేర్కొంది. అమ్మాయిల మాదిరిగా కాకుండా అబ్బాయిలు సామాజిక కట్టుబాట్లతో బయటపెట్టేందుకు సిగ్గుపడతారన్నారు. ఇది బాలురుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ తీర్పు సమాజంలో భిన్నమైన చర్చకు దారి తీసింది.