బాధితులను మతం పేరుతో ప్యాంటు విప్పి చూసి మరీ దారుణంగా చంపారు!
తాజాగా విడుదలైన ఈ వీడియో దృశ్యాలు ఉగ్రవాదుల మతోన్మాదానికి, క్రూరత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
By: Tupaki Desk | 26 April 2025 9:00 PM ISTజమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కారణంగా దేశం మొత్తం పాక్ మీద కోపంతో ఊగిపోతుంది. ఈ ఘటన మానవత్వానికే కళంకం తెచ్చే విధంగా ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో దృశ్యాలు ఈ దాడి భయంకరమైన స్వభావాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. ఈ వీడియోలో ఇస్లామిక్ ఉగ్రవాదులు హిందువుల తలపై నేరుగా గురిపెట్టి కాల్పులు జరుపుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అమానుషమైన చర్య భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. మతాన్ని ప్రాతిపదికగా చేసుకుని, ఒక్కొక్కరినీ గుర్తించి మరీ కాల్చి చంపిన ఈ హేయమైన చర్య సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. ఈ దారుణమైన దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇంతకుముందు వెల్లడైన ప్రాథమిక విచారణ వివరాల ప్రకారం.. ఉగ్రవాదులు పర్యాటకులను కాల్చి చంపే ముందు వారి మతాన్ని నిర్ధారించుకోవడానికి అత్యంత క్రూరమైన పద్ధతులను అనుసరించారు. మరణించిన వారిలో చాలా మంది పురుషుల ప్యాంటు జిప్‌లు తీయడం.. లేదా వారి ప్యాంట్లు క్రిందికి లాగి ఉండటం అధికారులకు కనిపించింది. కల్మా చదవమని బలవంతం చేయడం, సున్నతి ఉందో లేదో తనిఖీ చేయడం వంటి దారుణమైన చర్యలకు కూడా ఉగ్రవాదులు పాల్పడ్డారు.
తాజాగా విడుదలైన ఈ వీడియో దృశ్యాలు ఉగ్రవాదుల మతోన్మాదానికి, క్రూరత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. హిందువులను గుర్తించిన తర్వాత వారిని అత్యంత దారుణంగా, తలపై గురిపెట్టి కాల్చడం వారి మత ద్వేషానికి పరాకాష్టగా కనిపిస్తోంది. ఈ వీడియో దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది.
ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)తో కలిసి ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. దాడికి సహకరించిన అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకని విచారిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు విస్తృతమైన సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ భయంకరమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేశ ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.