Begin typing your search above and press return to search.

రాజు పైలట్.. రాణి ప్యాసింజర్.. ఓ విదేశీ టూర్.. కఠినమైన ల్యాండింగ్

థాయ్ లాండ్ ప్రజాస్వామ్య దేశమే అయినా.. అక్కడ రాచరికం ఉంది. ఆ దేశ రాజు పేరు మహా వజ్రలాంగ్‌ కోర్న్‌, రాణి సుతీదా.

By:  Tupaki Desk   |   30 April 2025 1:00 AM IST
రాజు పైలట్.. రాణి ప్యాసింజర్.. ఓ విదేశీ టూర్.. కఠినమైన ల్యాండింగ్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైనా చిన్న దేశం పర్యటనకు వెళ్లినా అధునాతన వసతులు ఉండే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోనే కదులుతారు.

భారత ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు ఎయిర్ ఇండియా వన్ విమానం పకడ్బందీ ఏర్పాట్లతో బయల్దేరుతుంది.

రష్యా, చైనా అధ్యక్షుల అధికారిక విమానాల గురించైతే చెప్పాల్సిన పనేముంది..? కానీ, ఓ దేశాధినేత తన భార్యతో కలిసి అత్యంత సాదాసీదాగా విదేశీ పర్యటన చేశారు.

థాయ్ లాండ్ ప్రజాస్వామ్య దేశమే అయినా.. అక్కడ రాచరికం ఉంది. ఆ దేశ రాజు పేరు మహా వజ్రలాంగ్‌ కోర్న్‌, రాణి సుతీదా.

వీరిని ఇటీవల భూటాన్‌ రాజు వాంగ్ చుక్ తమ దేశానికి ఆహ్వానించాడు. దీంతో థాయ్ లాండ్ రాజ దంపతులు తొలిసారిగా భూటాన్ వెళ్లారు.

సొంతంగా విమానం నడుపుకొంటూ..

థాయ్ రాజు మహా వజ్రలాంగ్ కోర్న్ స్వతహాగానే పైలట్. దీంతోనే స్వయంగా రాజకుటుంబానికి చెందిన బోయింగ్‌ 737-800 విమానాన్ని నడుపుతూ భూటాన్‌ లోని పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. భూటాన్ లో నాలుగు రోజులు ఉన్న థాయ్ లాండ్‌ రాజ దంపతులు మళ్లీ విమానం నడుపుకొంటూ వెళ్లారు. ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

థాయ్ రాజు వజ్రలాంగ్ కోర్న్.. గతంలో రాయల్‌ థాయ్‌ ఆర్మీలో కెరీర్‌ ఆఫీసర్‌ గా పనిచేశారు. ఎఫ్‌-5, ఎఫ్‌-16తో పాటు బోయింగ్‌ 737-400లను నడపగలరు. భూటాన్ పర్యటనకు తనతో కో పెలట్ ను మాత్రం తీసుకెళ్లారు.

ఇక పారో.. సాదాసీదా ఎయిర్ పోర్ట్ కాదు..

ప్రపంచంలో అత్యంత కఠినమైన ల్యాండింగ్ తో కూడిన విమానాశ్రయం. ఇక్కడ సేఫ్ గా ల్యాండింగ్ చేసిన థాయ్ రాజు.. తాను ప్రొఫెషనల్ పైలట్ అని చాటుకున్నారు.