2029 ఎన్నికల్లో టీడీపీ జనసేన ఎందుకు విడిపోతాయి అంటే ?
తెలుగుదేశం కూటమి మరో పదిహేనేళ్ళ పాటు కొనసాగుతుందని అలా జరగాలని పదే పదే జనసేన అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి అంటూంటారు
By: Satya P | 11 Aug 2025 6:26 PM ISTతెలుగుదేశం కూటమి మరో పదిహేనేళ్ళ పాటు కొనసాగుతుందని అలా జరగాలని పదే పదే జనసేన అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి అంటూంటారు. ఏపీలో అభివృద్ధి దృష్ట్యా ఒకే ప్రభుత్వం ఉండాలని ఆయన కోరుకుంటూంటారు. అంతే కాదు ఏపీలో రాజకీయాల వల్ల కూడా వైసీపీని దూరం పెట్టేందుకు సైతం కూటమి పొత్తులను ఆయన మనసారా ఆహ్వానిస్తున్నారు అన్నది ఒక రాజకీయ విశ్లేషణ. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అంతా కలిసే మరోసారి ఎన్నికలకు వెళ్ళాలని చూస్తోంది అని అంటారు. బీజేపీకి ఏపీలో పొత్తులు ఉంటే తప్ప కమలం వికసించదు. ఈ నేపథ్యంలో కూటమి శరణ్యం అవుతోంది. మరి ఇంతలా కూటమి పటిష్టంగా ఉంటే జనసేన టీడీపీ విడిపోతాయా ఒకవేళ అదే జరిగితే ఆ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న చర్చ అయితే సాగుతోంది.
అనేక రాజకీయ కారణాలు :
రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఎపుడూ శాశ్వతం కాదు. పొత్తు ఉండాలనీ లేదు, అలాగని విడిపోకూడదని కూడా ఎక్కడా లేదు. ఏపీలో చూసినా రాజకీయ కారణాల వల్లనే పొత్తులు పెటాకులు అయ్యే సూచనలు అయితే 2029 ఎన్నికల నాటికి కచ్చితంగా ఉంటాయని అంటున్నారు. అవేమిటి అంటే జనసేన పార్టీ 21 అసెంబ్లీ సీట్లఓ 100 స్ట్రైక్ రేట్ ని సాధించింది. అలా మాకు అంతటి బలం ఆదరణ ఉందని ఆ పార్టీ నమ్మకం. అయితే జనసేన ఓటు షేర్ ఏపీ పాలిటిక్స్ లో కేవలం ఆరు శాతమే అన్నది టీడీపీ లెక్కగా ఉంది అని అంటున్నారు. ఇలా ఈ రెండు పార్టీల మధ్య వాదనలు ఉన్నాయి. ఇవి పెరిగి పెద్దవి అయ్యే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయని అంటున్నారు.
సొంతంగానే ఎన్నికలకు :
ఇక టీడీపీలో ఇపుడు లోకేష్ యువ బృందం సందడి అధికంగా వుంది. వారి ప్రభావం సైతం చాలా కనిపిస్తోంది. పార్టీ నిర్ణయం పైన లోకేష్ ప్రాధాన్యత కూడా ఎక్కువ అని ప్రచారంలో ఉన్న మాట. ఆ విధంగా చూస్తే లోకేస్ యువ బృందం ఒక వాదనను పైకి తెస్తోంది అని అంటున్నారు. జగన్ మాదిరిగానే వచ్చే ఎన్నికల్లో సొంతంగా టీడీపీ ఎన్నికలకు పోవాలన్నదే ఆ వాదన అని చెబుతున్నారు. టీడీపీ బలమైన పార్టీ అని 2024లో సైతం సొంతంగా పోటీ చేస్తే గెలిచి వచ్చేది అని బ్రహ్మాండమైన మెజారిటీ కూడా వచ్చి ఉండేది అన్నది వారి వాదన.
బాబు బీజేపీ అదేనా :
మరో వైపు చూస్తే బీజేపీతో బాబు పొత్తుల ట్రాక్ రికార్డు ఒక యాంటీ సెంటిమెంట్ గా ఉంది అని అంటున్నారు. చంద్రబాబు ఒక ఎన్నికల్లో బీజేపీతో కలిస్తే మరో ఎన్నికల్లో వేరుపడతారు. లేకపోయినా కలసి పోటీ చేస్తే ఓటమి పలకరిస్తోంది. 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచిన బాబు 2004 నాటికి ఆ పొత్తుని కొనసాగించినా కూడా ఓటమి పాలు అయ్యారు. దాంతో బీజేపీతో పొత్తులు లేవని ప్రకటించారు. ఇక 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకుని గెలిచిన బాబు 2019 నాటికి ఆ పార్టీని వీడి ఒంటరిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఇపుడు 2024లో బీజేపీతో కలిశారు, గెలిచారు, కానీ 2029 నాటికి యాంటీ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈ పొత్తులు ఉంటాయా ఉన్నా గెలుపు సాధ్యమా అన్నది చర్చగా ఉంది అంటున్నారు.
జనసేన డిమాండ్లు భారీగానే :
ఇక ఏపీలో టీడీపీతో పొత్తుకు ఆసక్తిని చూపిస్తున్న జనసేన వచ్చే ఎన్నికల నాటికి కచ్చితంగా 50 ఎమ్మెల్యే సీట్లకు తక్కువ కాకుండా డిమాండ్ చేస్తుంది అని అంటున్నారు. వైసీపీ నుంచి జనసేనలోకి చేరిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల కోసం ఈ అదనపు సీట్లు కోరడం అనివార్యం అని అంటున్నారు. అంటే మొత్తం 225 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని అనుకున్నా అందులో పెరిగిన 50 అదనపు సీట్లూ జనసేనకు ఇచ్చేస్తే ఇక తమ్ముళ్ళకు కొత్త సీట్లు ఎలా అన్నది ఒక చర్చ పసుపు దళంలో ఉండనే ఉంటుంది. అంతే కాకుండా బీజేపీ సైతం వచ్చేసారి మరో 20 సీట్లు కోరితే అపుడు కేవలం 155 సీట్లకే పరిమితం అయి టీడీపీ పోటీ చేయాల్సి ఉంటుంది. ఈ రకమైన లెక్కలు పరిమితులు పరిధిలు ఇవన్నీ టీడీపీలో ఆశావహుల ఆశలను చంపేస్తాయి అని అంటున్నారు. అంతే కాదు పెరిగిన సీట్లలో మరింత మంది కొత్త వారు పార్టీకి సేవలు అందించిన వారు పోటీ చేయాలని అనుకుంటే మిత్రులకే ఏకంగా 70 సీట్లు సమర్పించుకోవడం అన్నది కుదరదు అని అంటున్నారు.
అక్కడ పేచీతోనే అలా :
దాంతో సీట్ల దగ్గర వచ్చే పేచీతోనే 2029 ఎన్నికల్లో మిత్రుల మధ్య విభేదాలు మొదలై అవి కాస్తా చివరికి పెటాకులకు దారి తీస్తాయని అంటున్నారు. ఒక వేళ అలా కాదు అని జనసేన అధినాయకత్వం తమకు తగ్గించిన సీట్లకు సైతం సర్దుకుపోయినా ఆ పార్టీలో అసంతృప్తి చెలరేగడం ఖాయమని అది కూడా కూటమి విజయానికి ఇబ్బందిగా మారుతుదని అంటున్నారు. ఇంకో వైపు బీజేపీకి ఎక్కువ సీట్లు ఇవ్వకపోయినా ఇబ్బంది ఇచ్చినా ఇబ్బంది ఇలా పొత్తులే సమస్యగా మారుతాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే 2024 మ్యాజిక్ 2029 నాటికి రిపీట్ అయ్యే చాన్సే లేదని అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.