Begin typing your search above and press return to search.

ఐపీఎల్ కి సినీ గ్లామర్.. ఇక్కడ వెంకీ అక్కడ వాళ్లు..!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అంతా ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది. అందుకే థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాల కలెక్షన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి

By:  Tupaki Desk   |   26 April 2025 7:17 PM IST
ఐపీఎల్ కి సినీ గ్లామర్.. ఇక్కడ వెంకీ అక్కడ వాళ్లు..!
X

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అంతా ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది. అందుకే థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాల కలెక్షన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. రెండు నెలల పాటు సాగే ఈ ఐపీఎల్ సీజన్ కి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మాక్సిమం క్రికెట్ లవర్స్ అంతా కూడా టీవీలకు అతుక్కుంటారు. ఐతే ఐపీఎల్ సీజన్ కి సినీ గ్లామర్ కూడా తోడైంది. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై మ్యాచ్ లకు సినిమా వాళ్ల తాకిడి ఎక్కువైంది.

ఎస్.ఆర్.హెచ్ అదే మన హైదరాబాద్ టీం కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉంటే అటెండ్ అవుతాడు వెంకటేష్. మన ప్లేయర్స్ కి సపోర్ట్ గా వెంకటేష్ వచ్చి అలా సందడి చేస్తాడు. ఐతే ఈ సీజన్ ఎస్.ఆర్.హెచ్ జట్టు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో గత రెండు మ్యాచ్ లను వెంకటేష్ మిస్ అయ్యాడు.

ఇక మరోపక్క చెన్నైలో మ్యాచ్ లకు అక్కడ సినిమా వాళ్ల తాకిడి మొదలైంది. నిన్న చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన ఎస్.ఆర్.హెచ్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కి కోలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ అటెండ్ అయ్యారు. చెన్నై, హైదరాబాద్ మ్యాచ్ కోసం తమిళ హీరో అజిత్ ఆయన భార్య షాలిని ఇంకా శివ కార్తికేయన్ సతీ సమేతంగా ఆట చూసేందుకు వచ్చారు. వీరితో పాటు స్టార్ హీరో శృతి హాసన్ కూడా చెన్నై కి సపోర్ట్ చేసేందుకు నిన్న లైవ్ మ్యాచ్ చూసేందుకు వచ్చింది.

మొన్న హైదరాబాద్ లో జరిగిన ఎస్.ఆర్.హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ గేం చూసేందుకు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ఉప్పల్ స్టేడియం కి వచ్చాడు. ఇంక ఎస్.ఆర్.హెచ్ మ్యాచ్ ఎప్పుడు ఉన్నా కూడా తనకు వీలు కుదిరినప్పుడల్లా హీరోయిన్ సంయుక్త మీనన్ స్టేడియం కి వచ్చి మన వాళ్లను ఎంకరేజ్ చేస్తుంది. గ్రౌండ్ లో క్రికెటర్స్ తో పాటు ఇష్టమైన స్టార్స్ కూడా క్రికెట్ లైవ్ చూసేందుకు రావడం ఆడియన్స్ కి మంచి థ్రిల్ కలిగిస్తుంది.

ఐతే నిన్న హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ లో చెన్నై ఓడిపోవడంతో హీరోయిన్ శృతి హాసన్ ఎమోషనల్ అయిన వీడియో కూడా వైరల్ అయ్యింది. ఆమె తెలుగు, తమిళ సినిమాలు చేస్తున్నా చెన్నై కి సపోర్ట్ చేయడం విశేషం.