Begin typing your search above and press return to search.

కర్రీ పఫ్ లో పాము పిల్ల.. యజమాని నిర్లక్ష్యానికి మహిళ ఏం చేసిందంటే?

అయితే కర్రీ పఫ్ ని ఎక్కడైతే తీసుకువచ్చిందో ఆ బేకరీ దగ్గరికి వెళ్లి మీరు తయారుచేసిన కర్రీ పఫ్ లో పాము పిల్ల వచ్చింది.

By:  Madhu Reddy   |   13 Aug 2025 12:05 PM IST
కర్రీ పఫ్ లో పాము పిల్ల.. యజమాని నిర్లక్ష్యానికి మహిళ ఏం చేసిందంటే?
X

చాలామంది జనాలు జంక్ ఫుడ్ తినడానికే ఇష్టపడుతూ ఉంటారు. బయటకు వెళ్లారంటే చాలు బయట ఉండే రెస్టారెంట్లలో,బేకరీలలో ఏదో ఒక ఫుడ్ తినకుండా ఇంటికి రారు. కానీ బయట ఉండే ఫుడ్ ని ఏ విధంగా తయారు చేస్తున్నారో కొన్ని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చక్కర్లు కొడుతూ ఉంటాయి.ఆ వీడియోలు చూస్తే అసలు మనం తినే ఫుడ్ ఇంత చెత్తగా ఉంటుందా..?ఇంత దరిద్రంగా తయారు చేస్తారా? అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా సరే బేకరీ దగ్గరికి, రెస్టారెంట్ దగ్గరికి వెళ్లినప్పుడు మాత్రం వారి ప్రాణం అటువైపు లాగుతుంది.ఎన్ని చెప్పినా.. ఎన్ని చేసినా.. ఎన్నిసార్లు హాస్పిటల్ పాలైనా సరే బయటికి వెళ్తే కచ్చితంగా ఏదో ఒక జంక్ ఫుడ్ తినాల్సిందే..

అయితే చాలామంది యూత్ బేకరీలో ఉండే ఎగ్ పఫ్, కర్రీ పఫ్ లు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.కానీ ప్రస్తుతం ఈ వీడియో చూస్తే మాత్రం కర్రీ పఫ్ తినాలంటేనే ఒళ్ళు జలదరించి పోవడమే కాదు భయం కూడా పుడుతుంది. ఎందుకంటే తాజాగా ఓ బేకరీ లోని కర్రీ పఫ్ లో పాము పిల్ల వచ్చింది.. ఇక అసలు విషయం ఏమిటంటే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓ బేకరీలో శ్రీశైల అనే మహిళ వెదర్ చల్ల చల్లగా ఉంది అని, తన ఇంటికి వెళ్లేటప్పుడు ఎగ్ పఫ్ లను,కర్రీ పఫ్ లను తీసుకొని వెళ్ళింది. ఇంటికి వచ్చాక పిల్లలతో కలిసి వాటిని ఎంతో ఇష్టంగా తింటున్న వేళ కర్రీ పఫ్ లో పాము పిల్ల బయటపడింది. అంతే ఆ కర్రీ పఫ్ లో పాము పిల్లను చూడడంతోనే ఆ కుటుంబం షాక్ అయిపోయింది. ఇంకా నయం దీన్ని తినలేదు అని ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ తింటే వారి పరిస్థితి ఎలా ఉండేదో ఊహించవచ్చు.

అయితే కర్రీ పఫ్ ని ఎక్కడైతే తీసుకువచ్చిందో ఆ బేకరీ దగ్గరికి వెళ్లి మీరు తయారుచేసిన కర్రీ పఫ్ లో పాము పిల్ల వచ్చింది. ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు అని సమాచారం ఇవ్వగా.. ఆ బేకరీ యాజమాన్యం వాళ్లకు ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారట. దాంతో ఆ కుటుంబం వెంటనే స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ బేకరీ పై ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు. ఇక కర్రీ పఫ్ లో పాము పిల్ల ఉన్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఈ వీడియో చూసిన చాలా మంది జనాలు బయట ఫుడ్ తినాలంటేనే భయంగా ఉంది..ఫుడ్ తయారు చేసేవారు మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అంటూ మండి పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ కుటుంబం ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి ప్రాణాలతో బయటపడింది. లేకపోతే ఏం జరిగేదో ఏమో అంటూ మాట్లాడుకుంటున్నారు.

అయితే ఇలా బయట నుంచి ఆర్డర్ చేసుకున్న ఫుడ్ లో అలాగే రెస్టారెంట్లో, బేకరీలో ఇలాంటి సంఘటనలు ఇప్పటికే ఎన్నోసార్లు చూశాం. బొద్దింక,బల్లి వంటివి తినే ఆహారంలో ఉన్నట్టు ఎన్నో వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఎన్నిసార్లు ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చినా కూడా బయట ఫుడ్ తినే వాళ్ళు అస్సలు ఆలోచించరు అని చెప్పవచ్చు.