Begin typing your search above and press return to search.

షాహిద్ అఫ్రీదీ అహంకారం ఇది... భారత్ పై తప్పుడు మాటలు!

అక్కడితో ఆగని అఫ్రీది అహంకారం, అజ్ఞానం... అసలు భారత్ ని తమ ప్రత్యర్థి అని పిలవడానికి కూడా అవమానంగా ఉంది అని వ్యాఖ్యానిచేవరకూ వెళ్లింది.

By:  Tupaki Desk   |   8 Jun 2025 1:06 PM IST
షాహిద్  అఫ్రీదీ అహంకారం ఇది... భారత్  పై తప్పుడు మాటలు!
X

కొంతమందికి వాస్తవాలు తెలిసినా, తనకు తెలిసిన వాస్తవాలు ప్రపంచమంతటికీ తెలుసని తెలిసినా కూడా నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నచందంగా వ్యవహార శైలిని కలిగి ఉంటారు. ఈ విషయంలో ఫస్ట్ ప్లేస్ కోసం ప్రయత్నించే పాకిస్థానీయుల్లో షాహిద్ అఫ్రీదీ ఒకరు! ఈ క్రమంలో తాజాగా మరోసారి భారత్ పై అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు.

అవును... భారత్ పై అవాకులూ చెవాకులూ పేలుతుంటాడు అఫ్రీది. అనంతరం ఇటు వైపు నుంచి చెంపలు వాచే కౌంటర్లు పడిన అనంతరం కామ్ అయిపోతుంటాడు. ఈ క్రమంలో తాజాగా మరోసారి భారత్ పై విషం కక్కాడు. ఇందులో భాగంగా.. క్రికెట్ లో అయినా, ధైర్యంలో అయినా, టెక్నాలజీలో అయినా పాక్ కంటే భారత్ పదేళ్లు వెనక్కే ఉందంటూ వ్యాఖ్యానించారు.

అక్కడితో ఆగని అఫ్రీది అహంకారం, అజ్ఞానం... అసలు భారత్ ని తమ ప్రత్యర్థి అని పిలవడానికి కూడా అవమానంగా ఉంది అని వ్యాఖ్యానిచేవరకూ వెళ్లింది. దీంతో... ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి పూర్తిగా అన్నీ వదిలేయాలని.. అంతటి అజ్ఞానం అఫ్రీది సొంతమని చెబుతున్నారు!

వాస్తవానికి అఫ్రీదీ చేసిన వ్యాఖ్యలు రివర్స్ లో కరెక్ట్ అని చెప్పాలి. యుద్ధం అయినా, క్రికెట్ అయినా, టెక్నాలజీ అయినా, అభివృద్ధి అయినా.. దేనిలోనూ భారత్ కు కనీసం దరిదాపుల్లో కూడా పాకిస్థాన్ లేదనే విషయం ఇరు దేశాలతో పాటు ప్రపంచానికీ తెలిసిన నగ్న సత్యం! ఆ విషయం అఫ్రీదీకి తెలియంది కాదు!

ఒకప్పుడు హై ఓల్టేజ్ గా నడిచిన భారత్ - పాక్ క్రికెట్ మ్యాచ్ ల విషయానికొస్తే... అవన్నీ ఇప్పుడు వార్ వన్ సైడ్ మ్యాచ్ లు గా మారిపోయాయి. మైదానంలో పాక్ ను చిత్తు చిత్తుగా కొట్టేస్తోంది టీమిండియా. ఇక ఇటీవల జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో పాక్ ఫెర్మార్మెన్స్, భారత్ ధమ్మూ ఇందుకు తాజా ఉదాహరణ. ఈ విషయం మాజీ క్రికెటర్ అయిన అఫ్రీదీకి తెలియంది కాదు!

ఇక ధైర్యం విషయానికొస్తే... ఇటీవల పహల్గాం పిరికి ఉగ్రదాడి అనంతరం భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ సమయంలో ఉగ్ర శిబిరాలతో పాటు పాక్ సైనిక స్థావరాలను నేలమట్టం చేసింది. దీంతో.. అటు ఉగ్రవాదులు, ఇటు పాక్ సైన్యం వణికిపోయాయి. ఫలితంగా... ప్రపంచ దేశాల ముందు సాష్టాంగ పడి భారత్ తో సీజ్ ఫైర్ కు మధ్యవర్తిత్వం చేయమని బ్రతిమాలుకుంది పాక్.

భారతదేశపు ధైర్యం విషయంలో షాహిద్ అఫ్రీదికి ఇంతకు మించిన తాజా ఉదాహరణ ఇంకేమైనా కావాలంటే... పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ని అడిగితే మరింత స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది! ఇక.. టెక్నాలజీ విషయానికొస్తే.. దీనికి చాలా ఉదాహరణలే ఉన్నప్పటికీ.. ఆపరేషన్ సిందూర్ లో బ్రహ్మోస్ క్షిపణి మిగిల్చిన జ్ఞాపకాలను అఫ్రీదీ ఒకసారి చూస్తే సరిపోతుంది!

ఒక్కమాటలో చెప్పాలంటే... భారత్ చంద్రునిపైకి రాకెట్లు పంపుతుంది, ప్రపంచ ఐటీకి నాయకత్వం వహిస్తుంది, క్రికెట్ లోనూ ఆధిపత్యం చెలాయిస్తుంది.. మరి పాకిస్థాన్ సొంత దేశంలో క్రికెట్ మ్యాచ్ లు ధైర్యంగా నడపలేని స్థితిలో ఉంది.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఐఎంఎఫ్ ముందు అప్పుల కోసం వేడుకుంటుంది.. ఈ విషయాలు అఫ్రీదికి తెలియకపోవచ్చు!