ఎయిర్ పోర్టులో ప్రియురాలితో దొరికిన రచిన్ రవీంద్ర.. వైరల్ వీడియో
ఐపీఎల్ 2025 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతున్నప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఈ సీజన్ ఆశించినంతగా లేదు.
By: Tupaki Desk | 23 April 2025 1:00 AM ISTఐపీఎల్ 2025 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతున్నప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఈ సీజన్ ఆశించినంతగా లేదు. జట్టు కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి కీలక మ్యాచ్‌లో తలపడటానికి సిద్ధమవుతోంది., సీఎస్కే యువ ఆటగాడు రచిన్ రవీంద్ర తాజాగా ప్రియురాలితో కలిసి సీఎస్కే జట్టుతో పాటు ఎయిర్ పోర్టులో కనిపించాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది.
ముంబై నగరంలో కనిపించిన ఈ యువ న్యూజిలాండ్ ఆటగాడు, తన వ్యక్తిగత గోప్యతను కోరుతూ కెమెరాలను తీయవద్దంటూ మీడియాకు విన్నవించాడు. ఎల్లో ఆర్మీ, ముంబై ఇండియన్స్‌తో జరిగే పోరు కోసం ముంబైకి వచ్చింది. ఈ సందర్భంగా సీఎస్కే ఓపెనర్ రచిన్ రవీంద్ర ముంబై వీధుల్లో సాధారణంగా తిరుగుతూ కనిపించాడు.
రచిన్ రవీంద్ర ముంబైలోని బాంద్రా ప్రాంతంలో పర్యటిస్తుండగా.. అతనితో పాటు ఒక యువతి కూడా ఉంది. వీరిని గుర్తించిన కొందరు ఫోటోలు తీయడానికి ప్రయత్నించగా, రచిన్ మర్యాదగా స్పందించాడు. అనంతరం ఎయిర్ పోర్టులో ప్రియురాలితో కలిసి ప్రయాణిస్తూ జట్టుతో పాటు తీసుకెళ్లడం సంచలనమైంది. ఇక్కడ వీడియోలకు దొరికాడు.
చేతి సంజ్ఞల ద్వారా తమ గోప్యతను గౌరవించాలని, ఫోటోలు తీయడం ఆపాలని రచిన్ సున్నితంగా కోరాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీడియా పట్ల స్టార్ క్రికెటర్ చూపిన వినయపూర్వకమైన, మర్యాదపూర్వకమైన వైఖరిని అభిమానులు ఎంతగానో ప్రశంసించారు. బహిరంగ ప్రదేశాల్లో సెలబ్రిటీల గోప్యతకు గౌరవం ఇవ్వాలనే చర్చను ఈ సంఘటన మరోసారి తెరపైకి తెచ్చింది.
సీఎస్కే వరుసగా ఓడుతూ పాయింట్ల పట్టికలో చిట్టచివరన ఉంది. ధోని సారథ్యం వహించినా కూడా టీం మెరుగుపడడం లేదు. ఈనెల 25న సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నైలో సీఎస్కే తలపడనుంది. ఇక జట్టుతోపాటే ప్రియురాలిని తీసుకెళుతూ రచిన్ రవీంద్ర సందడి చేస్తున్నాడు.