Begin typing your search above and press return to search.

ఉగ్రదాడి వేళ 'ఫేక్' హల్ చల్.. ఫ్యాక్ట్ చెక్ ఇదిగో!

అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం అసత్య ప్రచారం విపరీతంగా జరుగుతున్న పరిస్థితి!

By:  Tupaki Desk   |   29 April 2025 8:56 PM IST
ఉగ్రదాడి వేళ ఫేక్ హల్  చల్.. ఫ్యాక్ట్  చెక్  ఇదిగో!
X

ఇలా ప్రభుత్వం నుంచి ఓ వైపు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలను మరింత పెంచేలా అనేక వీడియోలు సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి ప్రచారాలు విపరీతంగా వైరల్ గా అవుతున్నాయి. ఈ సమయంలో పీటీఐ వార్తా సంస్థ ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది.

అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం అసత్య ప్రచారం విపరీతంగా జరుగుతున్న పరిస్థితి! ఈ సమయంలో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతున్న పలు ప్రచారాలను పీటీఐ వార్తా సంస్థ ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది. వాటి వెనుకున్న అసలు విషయాలను వరుసగా వెల్లడించింది.

* పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో లీపా లోయలో రెండు భారత చెక్ పోస్టులను పాకిస్థాన్ ఆర్మీ ధ్వంసం చేసిందని పేర్కొంటూ.. పర్వతాల్లో పొగ కమ్ముకున్న ఓ ఫోటో వైరల్ గా మారింది. దీనిపై పీటీఐ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఇందులో భాగంగా... అది సైన్యానికి సంబంధించింది కాదని, నార్తర్న్ ఐర్లాండ్ లో కార్చిచ్చుదని తేలింది.

* ఇదే సమయంలో... నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ మిలటరీ పోస్టులకు భారీ నష్టం సంభవించిందని పేర్కొంటూ.. ఆ దాడులకు సంబంధించిన దృశ్యాలుగా చెబుతున్న వీడియో వైరల్ గా మారింది! అయితే... అది తాజా వీడియో కాదని.. అది మే 2023లో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ మద్దతుదారులు భద్రతా బలగాలతో ఘర్షణకు దిగిందని వెల్లడించింది!

* అదేవిధంగా... పహల్గాం దాడి అనంతరం పౌరుల ఇళ్లను భారత్ సైన్యం లక్ష్యంగా చేసుకొని.. వారి నివాసాలను కూల్చివేస్తుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే... అది పూర్తిగా అవాస్తవమని, పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతుగా స్థానికంగా ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్న వారి నివాసాలనే కూల్చివేస్తున్నారని పీటీఐ ఫ్యాక్ట్ చెప్పి తెలిపింది.

* సరిహద్దుల్లో ఉన్న భారత భద్రతాదళాల చెక్ పోస్టులను పాకిస్థాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుందని చెబుతూ.. దీనికి సంబంధించి పర్వతాల్లో పేలుడు సంభవించిన వీడియోలు వైరల్ గా మారాయి. దీనిపైగా పీటీఐ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఇందులో భాగంగా... ఈ వీడియో 2020 నుంచి ఆన్ లైన్ లో ఉందని, ఎల్.ఓ.సీలో పాక్ ఆర్మీతో దీనికి ఏమీ సంబంధం లేదని స్పష్టం చేసింది!