బీజేపీ పై ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్!
ఇపుడు ప్రకాష్ రాజ్ ఏకంగా ఓట్ల కోసమే ఇదంతా అని హాట్ కామెంట్స్ చేస్తున్నారు మరి దీని మీద బీజేపీ నుంచి ఏ రకమైన స్పందన ఉంటుందో చూడాల్సి ఉంది.
By: Tupaki Desk | 16 May 2025 7:09 PM ISTప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీ మీద మరోసారి తన ఆగ్రహాన్ని అసహనాన్ని ప్రదర్శించారు. ఆయన ఈసారి బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సాగుతున్న తిరంగా యాత్ర మీద తన కామెంట్స్ చేశారు. బీజేపీ తిరంగా యాత్ర మల్లేశ్వరం, బెంగళూరులలో జరిగింది.
దానికి సంబంధించిన వీడియోలతో ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా పోస్ట్ సామాజిక మాధ్యమంలో ఉంచారు. దానిని రీ ట్వీట్ చేస్తూ ప్రకాష్ రాజ్ వీధులలో బెగ్గింగ్ స్టార్ట్ అయింది. ఓట్ల కోసం అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఓట్ల కోసం వీధుల్లో అడుక్కునే బిచ్చగాళ్ళు అని అంటూ అంతే తప్ప ఇందులో మరేమీ లేదు అని కామెంట్స్ చేశారు. జస్ట్ ఆస్కింగ్ అని ముగించారు.
ఇక ఆ వీడియోలు చూస్తే కనుక ఇక వాహనం నిండా యుద్ధానికి సంబంధించిన దృశ్యాలతో కటౌట్లు ఫ్లెక్సీలు కట్టి ఒక వాహనం బీజేపీ నేతృత్వంలో వీధులలో సాగుతోంది. . దాంతో పాక్ మీద భారత్ విజయం. అది బీజేపీ విజయంగా క్లెయిం చేసుకునేలా ఉంది అని అంటున్నారు.
దానిని పట్టుకునే సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ ఎటూ రైటిస్ట్ వింగ్ కి ఆపోజిట్ లో ఉంటారు. కాబట్టి ఆయన ఈ పోస్ట్ ని అట్రాక్ట్ అయి వెంటనే తన కామెంట్స్ ని పెట్టేశారు. అది కూడా డైరెక్ట్ గానే బెగ్గింగ్ అంటూ పెట్టడం అయితే సంచలనంగానే ఉంది.
బీజేపీ నాయకులు అయితే తిరంగా యాత్ర సైనికులకు దేశం అండగా ఉండేదుకు వారు పొరుగు దేశం మీద యుద్ధం చేసి తమ అసమాన ధైర్య సాహసాలు చూపించినందుకు అభినందిస్తూ చేస్తున్న కార్యక్రమం అంటోంది. అయితే కేవలం సైనికులనే కీర్తిస్తే ఫరవాలేదు కానీ మధ్యలో బీజేపీ గురించి మోడీ గురించి పొగడ్తలు ఎలా వస్తున్నాయని ప్రత్యర్ధులు అంటున్నారు.
అందుకే తిరంగా ర్యాలీ మీద విమర్శలు వస్తున్నాయని అంటున్నారు ఇందులో రాజకీయం ఏదీ లేదనే మే 13 నుంచి బీజేపీ నాయకత్వం దేశవ్యాప్తంగా తిరంగా యాత్రను చేస్తామని ప్రకటించిన బీజేపీ పెద్దలు ఆచరణలో అయితే అచ్చంగా రాజకీయమే చేస్తున్నారు అని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. చాలా చోట్ల మోడీ గురించి బీజేపీ గురించి చెబుతూ ఎక్కువ సమయం వాటికే తమ ప్రసంగాలలో ఇస్తున్నారు అని అంటున్నారు.
దాంతో తిరంగా ర్యాలీ కాస్తా రాజకీయంగా బీజేపీ కోసమా అన్న చర్చ మొదలైంది. ఇపుడు ప్రకాష్ రాజ్ ఏకంగా ఓట్ల కోసమే ఇదంతా అని హాట్ కామెంట్స్ చేస్తున్నారు మరి దీని మీద బీజేపీ నుంచి ఏ రకమైన స్పందన ఉంటుందో చూడాల్సి ఉంది.