Begin typing your search above and press return to search.

'ఐపీఎల్ ఫ్లడ్ లైట్లు హ్యాక్ చేశారు'.. మళ్లీ దొరికేసిన పాక్ మంత్రి!

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ జరిగిన కొన్ని రోజుల తర్వాత.. పాకిస్థాన్ వైమానిక దళం ఐదు భారత యుద్ధ విమానాలను కూల్చేసిందనే వాదనను తెరపైకి తెచ్చింది

By:  Tupaki Desk   |   17 Jun 2025 2:00 AM IST
ఐపీఎల్  ఫ్లడ్  లైట్లు హ్యాక్  చేశారు.. మళ్లీ దొరికేసిన పాక్  మంత్రి!
X

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ జరిగిన కొన్ని రోజుల తర్వాత.. పాకిస్థాన్ వైమానిక దళం ఐదు భారత యుద్ధ విమానాలను కూల్చేసిందనే వాదనను తెరపైకి తెచ్చింది. దీనిపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసీఫ్ కు అంతర్జాతీయ మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ఇందులో భాగంగా.. భారత యుద్ధ విమానాలు కూల్చేసినట్లు ఆధారాలు ఉన్నాయా అని అడిగారు.

ఈ ప్రశ్నకు సమాధానంగా స్పందించిన పాక్ రక్షణ మంత్రి ఎంతో కాన్ఫిడెంట్ గా... "ఆ విధంగా సోషల్ మీడియా అంతటా ప్రచారం జరుగుతుంది" అని అన్నారు. ఈ సమాధానం నుంచి షాక్ తిన్న యాంకర్ కాస్త తేరుకుని.. "మీరు రక్షణ మంత్రి.. సోషల్ మీడియా ప్రచారాన్ని ఆధారంగా చూపిస్తే ఎలా?" అన్నట్లు ప్రశ్నించారు. అయినా కూడా ఆసిఫ్ నుంచి ఆన్సర్ రాబట్టలేకపోయారు!

దీంతో.. నెటిజన్లు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిసీఫ్ ను ఓ ఆటాడేసుకున్నారు. ఇందులో భాగంగా... సోషల్ మీడియా ప్రచారాలను నమ్ముకున్న పాక్ రక్షణ మంత్రి.. రేపు యుద్ధంలో పాక్ గెలిచిందని ప్రచారం జరిగిందని చెప్పినా ఆశ్చర్యం లేదంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు. ఈ సమయంలో తాజాగా మరోసారి నెటిజన్లకు దొరికిపోయారు పాక్ రక్షణ మంత్రి.

అవును... తాజాగా పాకిస్థాన్ అసెంబ్లీలో మాట్లాడిన ఆసిఫ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ సైబర్ వారియర్స్.. భారతదేశంలోని క్రికెట్ స్టేడియంలో లైట్లు ఆపేశారని అన్నారు. దీంతో... నెటిజన్లు పాక్ రక్షణ మంత్రిని ఓ ఆటాడేసుకుంటున్నారు. ఫ్లడ్ లైట్లు వైఫై కనెక్షన్ తో పనిచేయవని.. విద్యుత్ వైర్ల సాయంతో వెలుగుతాయని గుర్తుచేస్తున్నారు.

వాస్తవానికి... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరున సైనిక దాడి ప్రారంభించింది. సరిగ్గా దానికి ఒకరోజు తర్వాత మే 8న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్.. సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ అంతరాయం కారణంగా మధ్యలో రద్దు చేయబడింది.

అయితే.. ఇదంతా పూర్తిగా పాకిస్థాన్ స్వదేశీ సాంకేతికత అని భారత్ కు అర్ధం కావడంలేదంటూ ఆసిఫ్ కామెంట్ చేశారు. ఇదే క్రమంలో... పాక్ సైబర్ యోధులు భారత్ పై దాడులు చేశారని.. భారత్ లోని క్రికెట్ స్టేడియంలో లైట్లు ఆపేశారని.. దీంతో మ్యాచ్ రద్దయ్యిందని.. వారి విద్యుత్ గ్రిడ్ మూసివేయబడిందని ఆసిఫ్ చెప్పుకొచ్చారు.

దీంతో.. నెటిజన్లు ఆసిఫ్ ను ఓ ఆటాడెసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. పాకిస్థాన్ లో సైబర్ కు భిన్నమైన సిలబస్ ఉంటుందనే విషయం తనకు తెలియదు అని ఒకరంటే... ఐపీఎల్ ఫ్లడ్ లైట్లు వైఫైతో పనిచేయవని.. అవి సురక్షితమైన విద్యుత్ వ్యవస్థలపైనే నడుస్తాయని.. వీటిని హోం రౌటర్స్ లాగా హ్యాక్ చేయలేరని కామెంట్ చేస్తున్నారు.

మరో నెటిజన్ అయితే.. మీ మాటలు విన్న తర్వాత మీరు కచ్చితంగా సైన్స్ క్లాస్ లో కాదు.. మదర్సాలోనే మీ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారని తాను భావిస్తున్నట్లు సెటైర్లు వేశారు!