Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నం: భార‌త్‌తో యుద్ధ‌మా.. వ‌ణికి పోతున్న పాక్ సైనికులు!

తాజాగా పాకిస్థాన్ సైనికుల అచేత‌న‌త్వం.. భార‌త్ ప‌ట్ల ఒణికిపోతున్న తీరు.. పాకిస్థాన్ 11వ దళ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ.

By:  Tupaki Desk   |   29 April 2025 11:00 PM IST
సంచ‌ల‌నం: భార‌త్‌తో యుద్ధ‌మా.. వ‌ణికి పోతున్న పాక్ సైనికులు!
X

భార‌త్‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేసి.. ఏ స‌మ‌స్య ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు.. త‌మ సార్వ‌భౌమ త్వాన్ని కాపాడుకునేందుకు స‌ర్వ‌స‌న్న‌ద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించిన పాకిస్థాన్ ప్ర‌ధాని హెహ‌బాజ్ ష‌రీఫ్‌కు కోలుకోలేని విధంగా సొంత సైనికులు షాక్ ఇచ్చారు. భార‌త్‌తో యుద్ధ‌మా.. మా వ‌ల్ల కాదని తేల్చి చెబుతూ.. కేవ‌లం రెండంటే రెండు రోజుల్లోనే 4500 మంది సైనికులు, 200 మందికిపైగా సీనియ‌ర్ అధికారులు త‌మ ఉద్యోగాల‌కు రాజీనామా స‌మ‌ర్శించి ఇంటికి వెళ్లిపోయారు.

కొంద‌రైతే.. ప్ర‌భుత్వం తీసుకునే చ‌ర్య‌ల‌కు భ‌య‌ట‌ప‌డి పొరుగు దేశాల‌కు కూడా వెళ్లిపోయారు. ఈ నేప థ్యంలో భార‌త్‌పై కాలు దువ్వుతామ‌ని.. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి ఘ‌ట‌న నేప‌థ్యంలో త‌మ జోలికి వ‌స్తే.. ఊరుకు నేది లేద‌ని చెప్పిన ప్ర‌ధాని ష‌రీఫ్‌.. ఇప్పుడు బిక్క‌చ‌చ్చిపోయారు. యుద్ధ‌మే వ‌స్తే.. ఎదుర్కొనేందుకు త‌మ సైన్యం సిద్ధంగా లేద‌ని తెలుసుకున్నారు. దీంతో అత్య‌వ‌స‌ర స‌మావేశ‌లు పెట్టి.. ఏం చేద్దామంటూ.. త‌ల ప‌ట్టుకున్నారు.

తాజాగా పాకిస్థాన్ సైనికుల అచేత‌న‌త్వం.. భార‌త్ ప‌ట్ల ఒణికిపోతున్న తీరు.. పాకిస్థాన్ 11వ దళ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ.. ఆదేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు రాసిన‌ లేఖ ద్వారా ప్ర‌పం చానికి తెలిసింది. ఈ లేఖ‌లో ఆయ‌న దాదాపు పాకిస్థాన్ సైనికుల కాళ్లు, గ‌డ్డం ప‌ట్టుకుని బ‌తిమాలు కుంటు న్న తీరు క‌ళ్ల‌కు క‌ట్టింది. పాకిస్థాన్ సైనికులు క‌నీస స‌మాచారం కూడా ఇవ్వ‌కుండా.. రాజీనామాలు చేస్తున్నార‌ని.. దీనివ‌ల్ల దేశ ఐక్య‌త పెనంపై నుంచి పొయ్యిలో ప‌డిన‌ట్టు అయింద‌ని.. ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా సైనికుల‌కు ఆయ‌న ప్ర‌తిజ్ఞ‌, సాహ‌సాలు, దేశ భ‌విత‌వ్యం వంటివాటిని గుర్తు చేస్తూ.. బాబ్బా బు.. ఈ ఒక్క‌సారికి.. అని బ్ర‌తిమాలుకున్న ప‌రిస్థితి క‌నిపించింది. ``మీ ప్ర‌తిజ్ఞ‌ను మీరు గుర్తు చేసుకోండి. దేశం కోసం త్యాగాల‌కు ఒడిగ‌డ‌తామ‌ని ప్ర‌తిన బూనిన మీరు.. ఇప్పుడు ఈ కీల‌క స‌మ‌యంలో కాడి ప‌డేస్తా రా?`` అని క‌న్నీటి ప‌ర్యంత‌మైన విధానం లేఖ‌లో రాసిన వాక్యాల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. అంతేకాదు.. భార‌త్ సైన్యం విజృంభిస్తే.. తాము త‌ట్టుకోలేమ‌న్న భావ‌న‌తో రిజైన్ చేస్తున్న సైనికుల‌కు ఆయ‌న సూక్తి ముక్తావ‌ళి కూడా బోధించారు.

``మ‌న బలం మీకు తెలియ‌దు. మ‌న‌కు చాలా బ‌లగంఉంది. మీరు త‌క్కువ‌గా అంచ‌నా వేస్తున్నారు. వ‌చ్చేయండి``అని బుఖారీ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. కాగా.. ప్ర‌స్తుతం స‌రిహ‌ద్దుల వెంబ‌డి తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. ఈ నేప‌థ్యంలో పాక్ సైన్యం కాడి ప‌డేసి.. ప‌రుగులు పెట్టి త‌లదాచుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం భార‌త దేశ సైనిక శ‌క్తిని ప్ర‌పంచానికి చాటుతోంద‌ని అంటున్నారు సైనిక నిపుణులు.