Begin typing your search above and press return to search.

పెహల్గాం ఉగ్రదాడి... ప్రత్యక్ష సాక్ష్యుల సంచలన విషయాలు!

పహల్గాంలోని బైసరన్ లోయలో సందర్శకులపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ప్రత్యక్ష సాక్ష్యులు తమ వాంగ్మూలాలను దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు.

By:  Tupaki Desk   |   29 April 2025 7:05 PM IST
పెహల్గాం ఉగ్రదాడి... ప్రత్యక్ష సాక్ష్యుల సంచలన విషయాలు!
X

జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన దాడి భారత్ లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ సమయంలో ఇప్పటికే పహల్గాం దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ మూసా పాక్ సైన్యంలో మాజీ పారా కమాండో అని దర్యాప్తులో తేలింది.

ప్రస్తుతం అతడు కరుడుగట్టిన టెర్రరిస్టుగా మారినట్లు దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబాతో కలిసి అతడు పనిచేస్తున్నట్లు వెల్లడించాయి. ఆ సంస్థ మాస్టర్ మైండ్లే అతడిని కశ్మీర్ కు పంపినట్లు పేర్కొన్నాయి. ఈ సమయంలో... పలువురు ప్రత్యక్ష సాక్ష్యులు దర్యాప్తు సంస్థల వద్ద పలు కీలక విషయాలు వెల్లడించారు.

అవును... పహల్గాంలోని బైసరన్ లోయలో సందర్శకులపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ప్రత్యక్ష సాక్ష్యులు తమ వాంగ్మూలాలను దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు. ఇందులో భాగంగా... పర్యాటకులు తప్పించుకొనే మార్గం లేకుండా చేసి ఉగ్రమూక దాడికి పాల్పడిందని ప్రత్యక్ష సాక్ష్యులు, దర్యాప్తు సంస్థలకు చెబుతున్నారు.

ఇదే సమయంలో... ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో ఉగ్రవాదులు ఉన్నారని.. తప్పించుకోవడానికి వీళ్లేకుండా చుట్టుముట్టారని తెలిపారు. ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థల వద్ద వాంగ్మూలంగా బాధితులు తెలియజేశారు. ఈ సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు ఎంట్రీ గేటు నుంచి లోపలికి వస్తే.. ఎగ్జిట్ గేటు వద్ద మరొకడు కాపలా ఉన్నాడని అన్నారు.

ఈ నేపథ్యంలో.. ఈ దాడిలో తొలిసారి కాల్పులు మొదలైంది ఎగ్జిట్ గేటు వద్దే అని.. దీంతో పర్యాటకులంతా ప్రాణభయంతో ఎంట్రీ గేటు వైపు పారిపోయారని.. ఈ నేపథ్యంలో అప్పటికే ఎంట్రీ గేటు వద్ద ఉన్న ఉగ్రవాదులు వారిపై దాడి చేశారని అన్నారు. వీరిలో ఇద్దరు సైనిక దుస్తులు ధరించగా.. ఒకడు సంప్రదాయ కాశ్మీరీ డ్రెస్ లో ఉన్నాడని తెలిపారు.

మరోపక్క జమ్మూకశ్మీర్ లో నాలుగు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ సమయంలో.. ఉగ్రవాదం అత్యధికంగా ఉండే దక్షిణ కాశ్మీర్ లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక.. నేడు దక్షిణకశ్మీర్ లో ఒకటి, షోపియాన్ ప్రాంతంలోని యార్వాన్ లో నేడు రెండు ఆపరేషన్లు జరుగుతున్నట్లు అధికారూలు పేర్కొన్నారు.