జిప్ లైన్ ఆపరేటర్ 'అల్లాహు అక్బర్'... ఎన్ఐఏ కీలక విషయాలు!
అవును... అహ్మదాబాద్ కు చెందిన రిషి భట్ అనే వ్యక్తి.. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన సమయంలో జిప్ లైన్ పై రైడ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు.
By: Tupaki Desk | 29 April 2025 9:28 PM ISTపహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రత్యక్ష సాక్ష్యుల వాంగ్మూలాలను తీసుకుంటున్నాయి. ఈ సమయంలో.. జిప్ లైన్ ఆపరేటర్ ‘అల్లాహు అక్బర్’ అన్న తర్వాతే లోయలో తుపాకీల మోత మొదలైందనే ఆరోపణల వేళ సదరు జిప్ లైన్ ఆపరేటర్ వ్యవహారంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారించింది!
అవును... అహ్మదాబాద్ కు చెందిన రిషి భట్ అనే వ్యక్తి.. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన సమయంలో జిప్ లైన్ పై రైడ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అయితే.. ఈ రైడ్ ప్రారంభించిన కాసేపటి తర్వాత.. కిందకు దిగిపోమంటూ అతని భార్య, కుమారుడు కేకలు వేశారు. దీంతో.. విషయం గ్రహించిన రిషి.. సుమారు 15 మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకేశారు.
అనంతరం కుటుంబాన్ని తీసుకుని అక్కడ నుంచి పరుగులు పెట్టి, దూరంగా వెళ్లి దాక్కొన్నారు. కాసేపటి తర్వాత కాల్పుల మోత వినిపించడం ఆగిన తర్వాత మరింత దూరం పరారయ్యారు. ఈ విషయాన్ని వెళ్లడిస్తూ.. తాను తీసుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఓ కీలక విషయాన్ని వెల్లడించారు.
ఇందులో భాగంగా... తనను రైడ్ కి పంపించే ముందు సదరు జిప్ లైన్ ఆపరేటర్.. అల్లాహ్ అక్బర్ అని మూడు సార్లు చెప్పడాన్ని తాను విన్నానని, అతడు అలా చెప్పిన తర్వాతే ఉగ్రదాడి ప్రారంభం అయ్యిందని.. అందువల్ల అతడిని కూడా అదుపులోకి తీసుకుని విచారించాలని కోరారు. పైగా... తనకంటే ముందు సుమారు 9 మంది వెళ్లగా.. వారిని పంపేటప్పుడు అతడు అలా చెప్పలేదని చెప్పుకొచ్చారు.
దీంతో... ఈ విషయం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా స్పందించిన జిప్ లైన్ ఆపరేటర్ ముజామిల్ తండ్రి అబ్దుల్ అజీజ్... తాము జమ్మూకశ్మీర్ కు చెందినవారమేనని.. తాము ఏపని చేస్తున్నా ‘అల్లాహ్ అక్బర్’ ని తలచుకుంటామని.. తాము ముస్లింలమని.. తుఫాను వచ్చినా అల్లాహ్ అక్బర్ అంటామని.. తమ కుమారుడు కూడా అలాగే చేశాడని చెబుతూ.. అందులో తప్పేముందని ప్రశ్నించారు.
విచారించిన ఎన్ఐఏ!:
పహల్గాం ఉగ్రదాడి సమయంలో అల్లాహ్ అక్బర్ అని నినాదాలు చేసిన జిప్ లైన్ ఆపరేటర్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) మంగళవారం విచారించింది! ఈ సందర్భంగా.. ముజామిల్ "అల్లాహ్ అక్బర్" అని అనడం అకస్మిక శబ్ధానికి సహజ ప్రతిచర్య అని.. అది హిందువులు "హే రామ్" అని చెప్పినట్లుగానే ఉందని జాతీయ మీడియాకు ఎన్.ఐ.ఏ వర్గాలు వెల్లడించాయి!
ఇదే సమయంలో.. ముజామిల్ కు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఎన్ఐఏ ప్రాథమిక విచారణలో తేలినట్లు వర్గాలు తెలిపాయి.