Begin typing your search above and press return to search.

పెదనాన్న స్కూల్ ప్రారంభించిన లోకేష్.. మేళతాళాలతో ఘన స్వాగతం!

ఈ సందర్భంగా ప్రసంగించిన లోకేష్... ప్రతీ వ్యక్తి జీవితంలోనూ గురువులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.

By:  Tupaki Desk   |   23 Jun 2025 8:47 PM IST
పెదనాన్న స్కూల్  ప్రారంభించిన లోకేష్.. మేళతాళాలతో ఘన స్వాగతం!
X

ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా... ఇంకొల్లులో తన పెదనాన్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు నెలకొల్పిన సైనిక పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా.. లోకేష్ కు అడుగడుగునా మేళతాళాలతో నీరాజనం పడుతూ ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన లోకేష్ విద్య గొప్పతనాన్ని తెలిపారు!

అవును... నారా లోకేష్ తొలిసారి.. త‌న పెద‌నాన్న డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో కలిసి తొలిసారి వేదిక‌ను పంచుకున్నారు. మాజీమంత్రి, ప‌రుచూరు మాజీ ఎమ్మెల్యే ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు.. త‌న తండ్రి చెంచురామ‌య్య జ్ఞాప‌కార్థం నిర్మించిన సైనిక్ స్కూల్‌ ను లాంఛ‌నంగా ప్రారంభించారు. వెంకటేశ్వర రావు భార్య పురందేశ్వరి బీజేపీ ఏపీ చీఫ్ అనే సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ప్రసంగించిన లోకేష్... ప్రతీ వ్యక్తి జీవితంలోనూ గురువులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. తాను 10వ తరగతి వరకూ భారతీయ విద్యాభవన్ లో చదివానని.. ఇంటర్మీడియట్ లిటిల్ ఫ్లవర్ లో చదివినట్లు తెలిపారు. తన జీవిత ప్రయాణంలో ఎంతో మంది గురువు ఇప్పటికీ తనకు సలహాలు, సూచనలు ఇస్తారని అన్నారు.

ఇదే సమయంలో.. ప్రతి ఒక్కరి జీవితంలో అన్ కండిషనల్ గా ప్రేమించే మనిషి తల్లి అని, ఆ తల్లుల త్యాగాల వల్లే మనమంతా చదువుకోగలుగుతున్నామని తెలిపారు. అందుకే ప్రతీ ఒక్కరూ ఇల్లు దాటే ముందు తప్పనిసరిగా తల్లి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరాలని అక్కడున్న విద్యార్థులందరికీ సూచించారు మంత్రి నారా లోకేష్.

డాక్టర్ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో ఈ సైనిక స్కూల్ ని ఏర్పాటు చేసి, మారుమూల ప్రాంతానికి ఒక సైనిక స్కూల్ ను తీసుకురావడం గొప్పవిషమని అన్నారు. పేదరికం నుంచి కుటుంబాలు బయటకు రావాలంటే అందుకు విద్య ద్వారా మాత్రమే సాధ్యమని తాను బలంగా నమ్ముతానని లోకేష్ వెల్లడించారు. విద్యద్వారానే జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయని తెలిపారు.