ఇంటర్నేషనల్ మీడియా: విశ్వగురు వర్సెస్ శాంతి దూత
విశ్వగురుగా ప్రచారం చేసుకునే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒకవైపు, ప్రపంచ శాంతి దూతగా ప్రచా రం చేసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోవైపు.
By: Garuda Media | 10 Aug 2025 10:47 PM IST``విశ్వగురుగా ప్రచారం చేసుకునే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒకవైపు, ప్రపంచ శాంతి దూతగా ప్రచా రం చేసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోవైపు. సుంకాలు, పాకిస్థాన్‌పై యుద్ధ విరమణ అంశాల్లో ఎవరి దారిది వారిది. వీరి ప్రభావం ప్రపంచ దేశాలపై ఎలా ఉంటుంది?. వీరిద్దరూ ఎటు వైపు మళ్లు తారు? ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి?. తృతీయ దేశాలకు వీరిచ్చే సందేశం ఏంటి?``. ఇదీ.. ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో పతాక శీర్షికల్లో వచ్చిన కథనం సారాంశం.
ప్రపంచ దేశాల్లో భారత్‌కు ఒక సుస్థిర స్థానం కల్పించామని.. ప్రపంచదేశాలకు మార్గదర్శిగా, వసుధైక కుటుంబం అనేభావనను తీసుకువచ్చామని ప్రధాని మోడీ పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. శాంతి కాముక దేశంగా తామున్నామని కూడా అంటున్నారు. అందుకే.. ఆయన `విశ్వగురు` అంటూ.. బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇక, మరోవైపు.. ప్రపంచ శాంతి దూత.. తమ అధ్యక్షుడేనని.. అమెరికా నాయకులు చెబుతున్నారు. ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాకే.. ప్రపంచంలో శాంతి సుమాలు విరుస్తున్నా యని అంటున్నారు.
వాస్తవానికి ట్రంప్ పగ్గాలు చేపట్టింది.. ఈ ఏడాది జనవరిలోనే. కానీ.. అప్పటికే రష్యా-ఉక్రెయిన్, గాజా-ఉజ్రాయెల్ దేశాల మధ్య యుద్దం జరుగుతోంది. అదేసమయంలో పాక్-భారత్ మధ్య కూడా తరచుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. వాటిని నిలువరించేందుకు తమ అధినేత ప్రయత్నిస్తు న్నారని.. ప్రపంచానికి `శాంతి సందేశం` ఇస్తున్నారంటూ.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చేసిన వ్యాఖ్యలు.. సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి. సరే.. ఇప్పుడు అసలు సంగతి.. విశ్వగురు-ప్రపంచ శాంతి దూతల మధ్యే నెలకొనడం.. భారత్ వర్సెస్ అమెరికాల మధ్య టారిఫ్‌ల నుంచి మొదలైన వివాదం పాక్‌తో జరిగిన ఆపరేషన్ సిందూర్ వరకు సాగడం వంటివి ఆసక్తిగా మారాయి.
నిజానికి భారత్‌కు అమెరికా మిత్రదేశం. ఈ విషయంలో సందేహం లేదు. అయితే.. ట్రంప్ విధించిన సుం కాలు.. పెంచేసిన జరిమానాలు వంటివి.. ఇప్పుడు కాక పుట్టిస్తున్నాయి. అంతేకాదు.. పాక్‌తో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ను నిలువరించేలా చేసింది కూడా తామేనని.. తమ ప్రమేయం లేకపోతే.. ఇరు దేశాల మధ్య ఎంతో నష్టం జరిగి ఉండేదని.. తాజాగా కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల క్రమంలో `విశ్వగురు`ను అధిగమించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్న వాదనను అంతర్జాతీయ మీడియా బలంగా ఎలుగెత్తింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయా? లేక.. తరుగుతాయా? అనేది చూడాల్సి ఉందని పేర్కొనడం గమనార్హం.