Begin typing your search above and press return to search.

కేటీఆర్ నువ్వు.. మ‌నిషివేనా? : మంత్రి సీత‌క్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క‌.. మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయ‌కుడు కేటీఆర్ పై నిప్పు లు చెరిగారు.

By:  Tupaki Desk   |   8 July 2025 5:08 PM IST
కేటీఆర్ నువ్వు.. మ‌నిషివేనా? : మంత్రి సీత‌క్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

తెలంగాణ గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క‌.. మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయ‌కుడు కేటీఆర్ పై నిప్పు లు చెరిగారు. ''అస‌లు నువ్వు మ‌నిషివేనా?'' అని ఆమె నిల‌దీశారు. ''నువ్వు నిజంగా మనిషివైతే, నీకు కళ్ళు సక్కగా కనపడితే ములుగులో పోలీస్ రాజ్యం ఎక్కడ నడుస్తోందో చెప్పు'' అని కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ''నువ్వు నీ పార్టీ అబద్దాల పునాదులపై పుట్టకపోతే పోలీసు రాజ్యం ఎక్కడ ఉందో చూయించు'' అని స‌వాల్ రువ్వారు.

కేటీఆర్ త‌న‌పై అన‌వ‌స‌రంగా వ్యాఖ్యానాలు చేస్తున్నార‌ని.. 2023 నుంచి 2025 వరకు బీఆర్ ఎస్‌ కార్యకర్తల మీద ములుగు పోలీసులు ఎన్ని కేసులు పెట్టారో చెప్పాల‌ని సీత‌క్క ప్ర‌శ్నించారు. కరోనా సమయంలో సొంత నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ మంత్రులు, నాయ‌కులు ప్రజలకు సేవ చేయలేదన్న ఆమె.. తాము ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతుంటే.. చూడ‌లేక‌పోతున్నార‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌లు బీఆర్ ఎస్‌ను ఛీ కొడుతున్నార‌ని.. అందుకే ఇలా త‌మ‌పై మాట‌ల‌తో దాడులు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

''అడవిబిడ్డ అయిన సీతక్కను టార్గెట్ చేస్తే మీకు ఏం వస్తది?. నిజాలు చూసి.. తెలుసుకుని మాట్లాడితే మంచిది. లేక‌పోతే.. మా అనుచ‌రులే నీకు త‌గిన బుద్ధి చెబుతారు'' అని సీత‌క్క వ్యాఖ్యానించారు. మ‌రోవైపు.. కేటీఆర్ .. సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ పార్టీ త‌ప్పుబ‌ట్టింది. కేటీఆర్ స్థాయి వేర‌ని.. రేవంత్ స్థాయికి ఆయ‌న ఏమా త్రం త‌గ‌ర‌ని నాయ‌కులు వ్యాఖ్యానించారు. హ‌ద్దులు మీరితే త‌గిన విధంగాబుద్ధి చెప్పాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.