ప్రిన్సెస్ డయానాను తాకిన పాప్ చక్రవ్రర్తి!
ఇటీవల మైఖేల్ జాక్సన్ ఓ ఈవెంట్లో ప్రిన్సెస్ డయానాను అప్రయత్నంగా చేతిని తాకగా, అతడిపై సీరియస్ అవుతున్న ప్రిన్స్ చార్లెస్ వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 16 May 2025 9:48 AM ISTపాప్ ప్రపంచపు రారాజుగా వెలిగిపోయాడు మైఖేల్ జాక్సన్. ప్రపంచవ్యాప్తంగా ఎందరికో అతడు డ్యాన్సులు స్పూర్తి. జాక్సన్ గతించి చాలా కాలం అయినా, ఇప్పటికీ అతడి మరణంలోని మిస్టరీ గురించి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అతడి ఆస్తులు, అప్పుల గురించి, పిల్లల గురించి నిరంతరం చర్చ సాగుతూనే ఉంది. మైఖేల్ జాక్సన్ గురించి ప్రతిరోజూ ఏదో ఒక వార్త ఇంటర్నెట్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతటి పాపులారిటీ ఉన్న ప్రముఖుడు అతడు.
మైఖేల్ జాక్సన్ దశాబ్ధాల క్రితం ఓ ఈవెంట్లో ప్రిన్సెస్ డయానాను అప్రయత్నంగా చేతిని తాకగా, అతడిపై సీరియస్ అవుతున్న ప్రిన్స్ చార్లెస్ త్రోబ్యాక్ వీడియో ఒకటి ఇటీవల ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈవెంట్లో జాక్సన్ ఎంతో సరదాగా డయానాతో మాట్లాడుతూ కనిపించారు. అనంతరం ప్రిన్సెస్ డయానా ట్రస్ట్ నుంచి చెక్కును కూడా అందుకున్నాడు. జాక్సన్ తన సొంత ఆల్బమ్ ఆడియో సీడీలను ప్రిన్సెస్ అండ్ ప్రిన్స్ బృందానికి అందజేసారు.
కానీ డయానాతో మాట్లాడుతున్న సమయంలో జాక్సన్ అనుకోకుండా ఆమె చేతిని తాకారు. ఆ సమయంలో ప్రిన్స్ చార్లెస్ అతడిపై సీరియస్ అవుతూ అలా తాకకూడదని కోప్పడ్డారు. దానికి జాక్సన్ తనదైన రీతిలో కూల్ గా సమాధానమివ్వడం కనిపించింది. నిజానికి రాజవంశపు రాణులను కానీ, రాకుమార్తెలను కానీ ఎవరూ తాకకూడదని నియమం ఉంది. కానీ అది మైఖేల్ జాక్సన్ కి తెలియదు. అతడు యథాలాపంగా డయానాను తాకాడు. అందులో అతడికి ఎలాంటి ఇంటెన్షన్ లేదు. కానీ ప్రిన్స్ తాకకూడదని సీరియస్‌గా చెప్పాడు. ప్రస్తుతం ఈ త్రోబ్యాక్ వీడియో ఇంటర్నెట్ లో మరోసారి వైరల్ గా మారుతోంది.