Begin typing your search above and press return to search.

క‌మ్మ‌-కాపు క‌లివిడా.. విడివిడా... !

రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం కలివిడి కారణంగానే 2024 ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన పార్టీల కూటమి ఘనవిజయం దక్కించుకుని అధికారంలోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   24 Jun 2025 3:00 PM IST
క‌మ్మ‌-కాపు క‌లివిడా.. విడివిడా... !
X

రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం కలివిడి కారణంగానే 2024 ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన పార్టీల కూటమి ఘనవిజయం దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. దీనికి తోడు సూపర్ సిక్స్ హామీలు కలిసి వచ్చాయి, ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికి కూడా తమ బంధం గట్టిగా ఉంటుందని వైసీపీకి ఆ పార్టీ అధినేతకు అసలు అవకాశం ఇచ్చేది లేదని కూటమి నాయకులు బలంగా చెప్పారు, అయితే ఇది క్షేత్రస్థాయిలో కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఐక్యంగా ఉన్నంతవరకు మాత్రమే సాగుతుంది అనేది పరిశీలకులు చెబుతున్న మాట.

ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలు సహా కృష్ణ గుంటూరు జిల్లాల్లో ఈ రెండు సామాజిక వర్గాలు కలివిడిగా పని చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏడాది తర్వాత పరిస్థితిని గమనిస్తే ఈ రెండు సామాజిక వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. చాలాచోట్ల ఇవి పెద్దవయ్యాయ‌ని కూడా వార్తలు వస్తున్నాయి. జనసేన లో ఉన్న కాపులు అనుబంధ సామాజిక వర్గాలు టిడిపిలో ఉన్న కమ్మ సామాజిక వర్గం కూడా ఎవరికి వారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనేది క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితి స్పష్టం చేస్తుంది.

కాబట్టి ఈ రెండు సామాజిక వర్గాల కలయిక బలంగా లేకపోతే ఓటు బ్యాంకును తరలించటం ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఇదే సమయంలో కాపు సామాజిక వర్గానికి చాలానే ఆశలు, అంచనాలు ఉన్నాయి. రిజర్వేషన్ తో పాటు కాపు కార్పొరేషన్ ద్వారా తమకు మేలు జరుగుతుందని ఆ సామాజిక వర్గం ఆశలు పెట్టుకుంది. దీనిపై పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేస్తారని భారీగానే అంచనాలు వేసుకుంది. ఏడాది కాలంలో ఈ విషయాన్ని పట్టించుకున్నారా లేదా కాపు సామాజిక వర్గం అంచనాలను చేరుకోవడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారా అనే దానిని బట్టి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కాపుల సానుకూలత కనిపిస్తుంది.

వచ్చే నాలుగేళ్ల వరకు సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు చిన్నపాటి వ్యతిరేకతలు కానీ అసంతృప్తులు కానీ ఉన్న పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేలు, ఎంపీలు భావిస్తున్నారు. అయితే వచ్చే నాలుగేళ్లలో ఏం జరుగుతుందనేది నిజంగా కీలక పరిణామం. మరి ఆ దిశగా కదిలినప్పుడు మాత్రమే కాపు, కమ్మ సామాజిక వర్గాల మధ్య ఐక్యత కొనసాగుతుంది. లేకపోతే తమ అవకాశాలను కమ్మ సామాజిక వర్గం దెబ్బతీస్తుందని, కమ్మ సామాజిక వర్గమేమో కాపు సామాజిక వర్గం వల్ల ప్రయోజనం లేదని భావించే పరిస్థితి వస్తే అది ఓటమి పార్టీలకు ఇబ్బందికరంగానే మారుతుంది.

కలిసి ఉన్నంత మాత్రాన ఓడిపోరని ఏమాత్రం చెప్పలేం. ఎందుకంటే ఫస్ట్ టైం ఎన్నో ఆశలతో కలిసినప్పుడే వైసీపీకి 40% ఓటు బ్యాంకు వచ్చింది. ఇప్పుడు ఐదు సంవత్సరాల పాలన తరువాత కలివిడి ఎలా ఉన్న ఆయా వర్గాల అంచనాలను చేరుకోకపోతే అది ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది ఆలోచించాల్సిన పరిస్థితి.