జనసేనను వీక్ చేయాలని టీడీపీ, వైసీపీ, బీజేపీ చూస్తున్నాయా ?
మరో వైపు ఏపీలో పెద్దగా బలం లేకపోయినా అధికారం వైపు చూస్తున్న బీజేపీ తన స్ట్రాటజీ మారిస్తే అది జనసేనకే ముప్పు అని అంటున్నారు
By: Tupaki Desk | 8 July 2025 8:00 AM ISTరాజకీయం అంటే అదే మరి. ఎపుడూ అలెర్ట్ ఉండాలి. ఒక విధంగా పద్మవ్యూహం లాంటిది. ఎవరూ ఇక్కడ మిత్రులు శాశ్వతంగా ఉండరు. అలాగే శత్రువులు అంతకంటే ఉండరు. కానీ జనసేన మాత్రం రెండు పార్టీలను శాశ్వత మిత్రులుగా మరో పార్టీని శాశ్వత శత్రువుగా భావించి రాజకీయం చేస్తోంది అంటున్నారు. అంతే కాదు అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు రాజకీయం మార్చుకుంటూ ముందుకు సాగాలి. కానీ జనసేన మాత్రం అలా చేస్తోందా అన్నదే చర్చగా ఉంది.
ఇక చూస్తే ఏపీలో కూటమిలో ఉన్న పార్టీలతో పాటు బయట ప్రత్యర్థిగా ఉన్న వైసీపీతో జనసేనకు ఇబ్బందే అన్న ప్రచారం సాగుతోంది. ఏపీలో ఇంకా ఎదుగుతున్న పార్టీగా జనసేన ఉంది. పెద్ద పార్టీలుగా చూస్తే టీడీపీ వైసీపీ వరసగా ఉంటాయి. ఆ తరువాత ప్లేస్ కచ్చితంగా జనసేనదే. ఆ పార్టీకి ఆరు నుంచి ఏడు శాతం ఓటు బ్యాంక్ కచ్చితంగా ఉంది.
ఇక జాతీయ స్థాయిలో బలంగా ఉన్నా కూడా బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారం అయితే ఈ రోజుకీ దఖలు పడలేదు. ఉన్నంతలో తెలంగాణాలో బీజేపీ మెరుగ్గా ఉందని అంటున్నారు. కానీ ఏపీలో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తే నోటా కంటే తక్కువ ఓట్లే ఆ పార్టీకి ఎపుడూ వస్తున్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఇక టీడీపీ వైసీపీలకు స్థిరంగా చెరి 40 శాతం ఓటు బ్యాంక్ ఉంది అన్నది గత మూడు ఎన్నికలూ రుజువు చేస్తున్న విషయమే. మరో వైపు ఏపీలో కాంగ్రెస్ కి ఒకటి నుంచి రెండు శాతం ఓటు షేర్ ఉంది అన్నది తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో వామపక్షాలకు ఎన్ని ఓట్లు వస్తాయన్నది అయితే ఇదమిద్దంగా తెలియదు కానీ విభజన ఏపీలో వారి చిక్కిపోయారు అన్నదే ఒక విశ్లేషణగా ఉంది.
ఏపీలో రాజకీయం జనసేనతో మారుతోంది. జనసేన లేకుంటే టీడీపీ వైసీపీ బలమైన పార్టీలుగా ఉంటూ పోటా పోటీగా రేసులో ఉంటాయి. అపుడు ఒక పార్టీ ఎపుడూ గెలుస్తూ ఉంటుంది. రాజకీయం కూడా రెండింటి మధ్యనే ఉంటుంది. అయితే జనసేన మధ్యలో రావడంతో 2024 ఎన్నికల్లో గేమ్ చేంజర్ అయింది. ఒక విధంగా ఏపీ రాజకీయాల్లో ఎవరు అధికారంలోకి రావాలి అన్న డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కూడా జనసేన మారింది. ఇది టీడీపీకే పెద్ద మైనస్ పాయింట్ గా మారింది అని అంటున్నారు.
ఇక వైసీపీది చూస్తే మొదటి నుంచి ఒంటరి పోరుగా ఉంది. జగన్ కి ఎవరు చెప్పారో కానీ సీఎం సీటు కంటే కూడా సొంతంగా పోటీ చేయడం మీదనే ఆయన డిసైడ్ అయిపోయారు. ఆ విధంగా 40 శాతం ఓటు షేర్ అయితే వైసీపీకి వస్తోంది కానీ అధికారం పొత్తులు లేకుండా దక్కుతుందా ఏపీలో మారిన రాజకీయాల్లో అంటే వైసీపీ అధినాయకత్వం మాత్రం ఒంటరి పోరే అంటోంది. అయితే ఒంటరి పోరుతో అధికారం జగన్ కి అంత ఈజీ కాదని అంటున్నారు.
అయితే వైసీపీకి కేవలం 11 శాతం ఓట్లు వచ్చాయనడం కంటే 40 శాతం ఓటు షేర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో అలా వైసీపీ కీలకంగానే ఈ రోజుకీ ఉంది. జనసేన విషయం తీసుకుంటే అధికారంలోకి వచ్చి ఏడాది అయినా పార్టీని పటిష్టం చేయలేదని అంటున్నారు. దాంతో జనసేన ఏ విధంగానూ ఎదగడం లేదని గుర్తు చేస్తున్నారు.
ఆ పార్టీ పట్ల భావోద్వేగం అయితే ఉంది కానీ గ్రౌండ్ లెవెల్ లో చూస్తే మాత్రం పెద్దగా ఏమీ లేదు అని అంటున్నారు. కాపులు బలిజలు ఉత్తరాంధ్రలోని కొన్ని సామాజిక వర్గాలు జనసేన పట్ల అభిమానం చూపిస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో ఇస్తున్న ప్రకటనలు మాత్రం వారిలో నిరాశ వ్యక్తం అవుతోంది. పైపెచ్చు తనను పాలనానుభవం ఏమీ లేదని చంద్రబాబుకు గొప్ప పాలనానుభవం ఉందని చెప్పడంతో ఈ సామాజిక వర్గాలు అన్నీ రగిలిపోతున్నాయి అంటున్నారు.
ఇలా ఎన్ని రోజులు ఎంత కాలం మనం ఇలాగే ఉండాలా అని ఆ సామాజిక వర్గాలు జనసేన నేతలను నిలదీస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఎవరు ఏమనుకున్నా మాత్రం పవన్ కళ్యాణ్ స్పందించడం లేదని అంటున్నారు. ఆయ్న ఒకే మాట చెబుతున్నారు. అదే పదే పదే చెబుతున్నారు. చంద్రబాబు మరో పదిహేనేళ్ళ పాటు ఏపీకి సీఎం గా ఉండాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు.
అయితే జనసేన అధినేత ఈ విధంగా మాట్లాడటం వెనక వ్యూహం ఉందని అంటున్నారు. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేస్తే జనసేన గెలిచేది పెద్దగా ఉండదు, బీజేపీతో జత కట్టినా అదే ఫలితం వస్తుంది దాంతో టీడీపీ వంటి పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి పదవిని మెగా ఫ్యామిలీ పూర్తిగా ఎంజాయ్ చేస్తోంది అని ఆరోపణలు వస్తున్నాయట.
పైస్థాయిలో అధికారం ఉంది. గౌరవం ఉంది, చంద్రబాబు ఎంతో మర్యాద ఇస్తారు, ఇవన్నీ బాగున్నాయి బాబు సీఎం నేను డిప్యూటీ అన్నట్లుగా ఎన్నాళ్ళూ ఉన్నా బాగానే ఉంటుంది అన్నదే సేనాని స్ట్రాటజీ అని అంటున్నారు. అయితే ఒక బలమైన సామాజిక వర్గానికి అలాగే అభిమానులకు అనుచరులకు మాత్రం ఎల్లకాలం టీడీపీకే సీఎం పదవి అన్నది అసలు మింగుడు పడడం లేదుట. .
మరో వైపు ఏపీలో పెద్దగా బలం లేకపోయినా అధికారం వైపు చూస్తున్న బీజేపీ తన స్ట్రాటజీ మారిస్తే అది జనసేనకే ముప్పు అని అంటున్నారు అలాగే జనసేనతో అధికారం దీర్ఘకాలం పంచుకోవడానికి టీడీపీకి ఇష్టం లేకపోతే ఆ వైపు నుంచి సవాళ్ళు ఎదురవుతాయని అంటున్నారు. ఎటూ ప్రత్యర్థిగా వైసీపీ ఉంది, జనసేన పట్ల ఏమైనా అసంతృప్తి ఏర్పడితే దానిని ఈజీగా తమ వైపునకు తిప్పుకోవాలని చూస్తుంది. ఇలా ముప్పేట దాడి అయితే రాజకీయంగా ముందు ముందు జనసేనకు ఉండబోతోందా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.