జగన్ ని అరెస్ట్ చేస్తారన్న సన్నిహిత నేత!
మద్యం కేసు అన్నది రాజకీయంగా ప్రేరేపితమైన కేసు అని ఆయన అన్నారు. అసలు లిక్కర్ కేసుతో జగన్ కి ఏమిటి సంబంధమని పేర్ని నాని ప్రశ్నించారు.
By: Tupaki Desk | 16 May 2025 9:14 PM ISTఅవునా ఇది నిజమేనా అంటే చెబుతున్నది జగన్ కి అత్యంత సన్నిహితుడైన వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లేని దాన్ని ఉన్నట్లుగా చూపిస్తున్నారు అన్నారు. లిక్కర్ స్కాం విషయంలో ఏదో విధంగా జగన్ ని ఇరికించి జైలుకు పంపాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.
అందుకోసం ప్రతీ ఒక్కరి మీద అక్రమ కేసులు పెడుతున్నారని వారి నుంచి తప్పుడు సాక్ష్యాలు చెప్పించాలని చూస్తున్నారని ఆయన సిట్ అధికారుల తీరు మీద మండిపడుతున్నారు. ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేయించి 53 రోజులు ఉంచారని కక్షతో ఇపుడు అంతకు ఒక్క రోజు అయినా అదనంగా జగన్ ని ఉంచాలని రాజకీయ కుట్ర సాగుతోందని పేర్ని నాని అంటున్నారు.
మద్యం కేసు అన్నది రాజకీయంగా ప్రేరేపితమైన కేసు అని ఆయన అన్నారు. అసలు లిక్కర్ కేసుతో జగన్ కి ఏమిటి సంబంధమని పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ ని ఏదో విధంగా అరెస్ట్ చేయించాలని చంద్రబాబు తొందర పడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. సిట్ స్టాండ్ వ్యవస్థలతో జగన్ ని అరెస్ట్ చేయించాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారని ఆయన విమర్శించారు.
పార్టీ క్యాడర్ కూడా తప్పుడు కేసులకు జడవదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పేర్ని నాని చేసిన ఈ కామెంట్స్ మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది నిజంగా మద్యం కేసులో జగన్ ని అరెస్ట్ చేస్తారా అన్నది అంతా ఆలోచిస్తున్నారు. లిక్కర్ స్కాం లో జగన్ పాత్ర మీద తప్పుడు ఆధారాలు సేకరిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే కడప జిల్లాకు చెందిన మండిపల్లి రాం ప్రసాదరెడ్డి కూడా జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా అరెస్ట్ అవుతారని చెబుతున్నారు. అటు అధికార పక్షం నుంచి కూడా జగన్ అరెస్ట్ అని అంటున్నారు అంటే ఏపీ రాజకీయాల్లో ఏదో జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
మరి నిజంగా అలా జరుగుతుందా లిక్కర్ స్కాం కేసు క్లైమాక్స్ కి వచ్చిందా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈడీ కూడా రంగంలోకి దిగిన ఈ కేసు సీరియస్ గానే ఉందని అంటున్నారు మరి ఈ కేసులో ఎవరి పాత్ర ఏమిటి అన్నది కూడా సిట్ విచారిస్తోంది అని అధికార పక్షం అంటోంది. మరి లిక్కర్ స్కాం కేసులో రాజకీయ ప్రకంపనలు గట్టిగానే ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఈ కేసులో ఏమి జరుగుతుందో ఏమిటో.