చీర్‌లీడర్ల సెలెక్షన్ ఎలా జరుగుతుందో తెలుసా?
ఏదైనా ఐపీఎల్ ఫ్రాంచైజీలో చీర్‌లీడర్ల సెలక్షన్ ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. టీమ్ మేనేజ్‌మెంట్ లేదా స్పాన్సర్‌లు వీరిని ఇంటర్వ్యూ చేస్తారు.
By: Tupaki Desk | 27 April 2025 2:00 PM ISTCheer Girls : ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ 45రోజులకు క్రికెట్ ప్రియులకు పండుగనే చెప్పాలి. మ్యాచ్ ల సమయంలో ఫోర్లు, సిక్సర్లు పడిన వెంటనే కెమెరా దృష్టి మొదట చీర్‌లీడర్స్‌పైన పడుతుంది. ఈ చీర్‌లీడర్స్ తమ జట్టు వికెట్లు లేదా ఫోర్లు, సిక్సర్లను సెలబ్రేట్ చేయడానికి ఉంటారు. మ్యాచ్ ఉత్సాహాన్ని నిలబెట్టడానికి, ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వారి ఉత్సాహం తగ్గకుండా చూసేందుకు ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో చీర్‌లీడర్స్‌ను నియమిస్తారు. అంతేకాకుండా, చీర్‌లీడర్స్ ఆటగాళ్లలో కూడా ఉత్సాహాన్ని నింపే పని చేస్తారు. అయితే చీర్‌లీడర్‌గా మారడానికి ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు.. దాని పూర్తి ప్రాసెస్ ఏమిటో మీకు తెలుసా ?
ఏదైనా ఐపీఎల్ ఫ్రాంచైజీలో చీర్‌లీడర్ల సెలక్షన్ ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. టీమ్ మేనేజ్‌మెంట్ లేదా స్పాన్సర్‌లు వీరిని ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఇంటర్వ్యూలు వీడియో లేదా పర్సనల్ గా నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ సమయంలో చీర్‌లీడర్ డ్యాన్స్, మోడలింగ్ నైపుణ్యాలను టెస్ట్ చేస్తారు. దీనితో పాటు, వేలాది మంది ప్రేక్షకులు నిండిన స్టేడియంలో చీర్‌లీడర్స్ ఆటగాళ్ల ఉత్సాహాన్ని ఎలా పెంచగలరో కూడా పరిశీలిస్తారు.
చీర్‌లీడర్‌లను ఎన్నుకునేటప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్ వారిలో ఆటగాళ్లు, జట్టుతో సఖ్యతను ఏర్పరచుకునే కెపాసిటీ వారికి ఉందో లేదో కూడా చూస్తుంది. అలాగే వారు జట్టును మెరుగుపరచడంలో ఏ విధంగా సహాయపడగలరో కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఆదాయం విషయానికి వస్తే చీర్‌లీడర్‌లు లక్షల రూపాయల వరకు సంపాదిస్తారు. మీడియా నివేదికల ప్రకారం.. ఒక సీజన్‌లో వారి సంపాదన మూడు నుండి నాలుగు లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు.
చీర్‌లీడర్‌లు ధరించే దుస్తులను పూర్తిగా స్పాన్సర్‌లను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తారు. ఎందుకంటే వాటి పూర్తి ఖర్చును స్పాన్సర్‌లే భరిస్తారు. వారి దుస్తులలో టీమ్, కంపెనీల లోగోలు ఉంటాయి.