కెమెరాలో రికార్డయిన వేధింపుల ఘటన... ఇన్ఫ్లుయెన్సర్ చర్యకు నెటిజన్లు ఫిదా!
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాన్సీ సురవాసే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేసింది. ఆమె తన అపార్ట్‌మెంట్ భవనంలో రీల్ తీస్తుండగా జరిగిన వేధింపుల దృశ్యాన్ని వీడియో తీసింది.
By: Tupaki Desk | 29 April 2025 3:00 PM ISTఇటీవల కాలంలో మహిళలు ఆన్‌లైన్‌లో వేధింపులకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అయితే, కొందరు ధైర్యంగా వాటిని ఎదుర్కొంటున్నారు. తాజాగా, ఓ ఇన్ఫ్లుయెన్సర్ తనను వేధించిన వ్యక్తికి ఊహించని విధంగా బుద్ధి చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాన్సీ సురవాసే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేసింది. ఆమె తన అపార్ట్‌మెంట్ భవనంలో రీల్ తీస్తుండగా జరిగిన వేధింపుల దృశ్యాన్ని వీడియో తీసింది. ఎరుపు రంగు స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించిన మాన్సీ, మెట్లపై తన లుక్ సరిచేసుకుంటుండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు.
గులాబీ, తెలుపు రంగు చారల టీ-షర్ట్, నీలం రంగు ప్యాంటు ధరించిన ఆ వ్యక్తి మెట్లు ఎక్కుతుండగా, మాన్సీ మర్యాదగా పక్కకు జరిగింది. అయితే, అతను కేవలం దాటి వెళ్ళకుండా ఆమెను అసభ్యకరంగా టచ్ చేశాడు. వెంటనే రియాక్ట్ అయిన మాన్సీ అతన్ని నిలదీసి గట్టిగా చెంప చెల్లుమనిపించింది. ఆ దృశ్యం కెమెరాలో రికార్డయింది. ఆ వ్యక్తి వెంటనే అక్కడి నుండి పారిపోతూ పదే పదే "సారీ, సారీ!" అంటూ క్షమాపణలు చెప్పాడు.
తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో మాన్సీ ఈ ఘటన తర్వాత తాను సాక్ష్యాలతో సహా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను నిలదీసినట్లు తెలిపింది. ఆ కుటుంబం అతనికి "మానసిక ఆరోగ్య సమస్యలు" ఉన్నాయని, అలాంటి ప్రవర్తన క్షమించమని కోరినట్లు తెలిపింది. ఈ వీడియో వైరల్ కావడంతో మాన్సీ ధైర్యానికి నెటిజన్ల నుంచి మంచి మద్ధతు లభించినప్పటికీ, అధికారికంగా పోలీసు ఫిర్యాదు దాఖలు చేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది.