Begin typing your search above and press return to search.

ఈసారి పాక్ నడ్డి విరిచేలా మోడీ ప్లాన్ !

అయితే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే కనుక పాక్ నడ్డి విరిచేసేలా ఎన్నో సంచలన నిర్ణయాలు ఈసారి భేటీలో తీసుకుంటారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   29 April 2025 8:57 PM IST
ఈసారి పాక్ నడ్డి విరిచేలా మోడీ ప్లాన్ !
X

పాకిస్థాన్ పీచమణచాలి. ఇది దేశ ప్రజల కోరిక. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ కోరిక కూడా ఇదే. అయితే జనం మూడ్ కి తగినట్లుగా సీరియస్ యాక్షన్ తీసుకోవడం ద్వారా తాను అనుకున్నది చేయడం బీజేపీ పక్కా వ్యూహం. ఇపుడు కోట్ల జనం ఎటూ దాయాది పాక్ మీద పగ సాధించమంటున్నారు దాంతో బీజేపీ మరింత దూకుడుని ప్రదర్శిస్తోంది.

ఈ నెల 22న కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్ర దాడి మీద బీజేపీ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అన్నది వాస్తవం. మరో వైపు చూస్తే ఈ ఉగ్ర దాడి జరిగిన వెంటే విదేశీ పర్యటనను మధ్యలోనే ఆపేసి మరీ ప్రధాని నరేంద్ర మోడీ భారత్ కి వచ్చారు. 23వ తేదీ కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు.

అలా గత వారం జరిగిన భద్రతా కేబినెట్ కమిటీ సమావేశంలో నరేంద్ర మోడీ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో అతి ముఖ్యమైనది సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం అలాగే దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ జాతీయుల వీసా రద్దు వంటివి ఉన్నాయి. వీటి దెబ్బకే పాకిస్తాన్ కకావికలం అయిపోతోంది. ఏమి చేయాలో కూడా ఆ దేశానికి అర్థం కావడం లేదు.

నీరు లేకుండా బంధించి పాక్ ని అతలాకుతలం చేసే చర్యలకు భారత్ దిగుతుందని కలలో సైతం ఊహించని పాక్ కి అది ప్రాణ సంకటంగా మారింది. మరి దానికే గింగిరాలు కొడుతున్న పాక్ కి ఇపుడు ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించనున్న మరో కీలక సమావేశం ఏ రకమైన ఝలక్ ఇస్తుందో అన్నది అంతటా ఉత్కంఠగా ఉంది.

మోడీ అధ్యక్షతన బుధవారం భద్రతా ఏబినెట్ కమిటీ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్ తో పాటు కేబినెట్ కార్యదర్శి టీవీ స్వామినాధన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్త్రీతో పాటు ప్రధాన మంత్రి ఇద్దరు ప్రిన్సిపల్ కార్యదర్శులు పీకే మిస్త్ర, శక్తికాంత్ దాస్ పాల్గొంటారు అని అంటున్నారు. అంతే కాదు ఈ కమిటీలో మరో సభ్యురాలుగా ఉన్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతారు అని అంటున్నారు.

ఆమె గతవారం జరిగిన భేటీకి రాలేదు. అపుడు ఆమె అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇదిలా ఉంటే కేవలం వారం రోజుల వ్యవధిలో జరుగుతున్న ఈ సమావేశం మీద అందరి దృష్టి ఉంది. ఈ సమావేశంలో ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు అని అంతా చర్చిస్తున్నారు.

అయితే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే కనుక పాక్ నడ్డి విరిచేసేలా ఎన్నో సంచలన నిర్ణయాలు ఈసారి భేటీలో తీసుకుంటారు అని అంటున్నారు. అంతే కాదు పాక్ ని పూర్తిగా అతలాకుతలం చేసే విధంగా ఈ నిర్ణయాలు ఉండబోతున్నాయని అంటున్నారు. పాక్ ని యుద్ధంతో కాదు దౌత్య పరంగానే ఓడించి వాడిపోయేలా ఈ భేటీ ఉంటుందని అంటున్నారు. దాంతో ఇపుడు ఈ భేటీ అంతర్జాతీయ అంశంగా మారుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.