Begin typing your search above and press return to search.

పాక్ కు భారత్ బిగ్ షాక్.. పక్కా ప్లానింగ్!

ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ కంటే ముందు దౌత్యపరంగా భారత్ పలు నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 Jun 2025 12:50 PM IST
పాక్  కు భారత్  బిగ్  షాక్.. పక్కా ప్లానింగ్!
X

ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ కంటే ముందు దౌత్యపరంగా భారత్ పలు నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ తో ఉన్న సింధూజలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగా.. జమ్మూకశ్మీర్ లో హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

అవును... పాకిస్థాన్ కు పక్కా ప్లానింగ్ తో భారత్ షాకులిస్తోంది. ఇప్పటికే పలు దౌత్యపరమైన నిర్ణయాలతో పాటు ఆపరేషన్ సిందూర్ తో ఇవ్వాల్సిన షాకు ఇచ్చిన భారత్.. జమ్మూకశ్మీర్‌ లో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించారు.

సింధు జలాల ఒప్పందం విషయంలో ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టుల్లో ఎటువంటి మార్పులు లేవని.. ఎందుకంటే వీటి సాంకేతిక అంశాలు ఇప్పటికే నిర్ణయించేశారని తెలిపిన మంత్రి... కొన్ని ప్రాజెక్టులు ప్రారంభ దశలోనే ఉన్నాయని.. వాటిల్లో విద్యుత్తు ఉత్పత్తిని ఎక్కువగా చేసేందుకు మరింత నీటి నిల్వ సామర్థ్యం పెంచవచ్చని తెలిపారు. దీంతో... త్వరలో ప్రాక్టికల్ గా పాక్ గొంతు ఎండటం కన్ఫాం అనే మాటలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి సిందూ నదీ జలాల ఒప్పందం కారణంగానే ఇన్నాళ్లూ సింధుతో పాటు దాని ఉప నదులపైనా భారత్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ ప్లాంట్ల నిర్మాణంతోపాటు నీటినిల్వ సామర్థ్యం పెంచడం కూడా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. అయితే... ఇప్పుడు ఈ ఒప్పందాన్ని నిలిపివేయడంతో.. కొత్త ప్రాజెక్టులతో పాటు నీటి నిల్వను కూడా పెంచే అవకాశం లభించింది.

ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ లో నాలుగు హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులను ఆమోదించింది సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ. కానీ, ఇవి ఇంకా నిర్మాణ పనులను ప్రారంభించాల్సి ఉంది. వీటిల్లో సింధు నదిపై న్యూ గందర్బాల్‌ ప్రాజెక్టు.. జీలంపై ఉరి-1, 2.. చీనాబ్‌ పై కిర్తాయ్‌-2, సవల్‌ కోట్‌ ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి.

కాగా... సింధు నదీ జలాలను పంచుకోవడానికి భారత్, పాకిస్థాన్‌ ల మధ్య ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీనిపై 1960 సెప్టెంబరులో నాటి భారత ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ, పాకిస్థాన్‌ అధ్యక్షుడు అయూబ్‌ ఖాన్‌ సంతకాలు చేశారు. అయితే.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఈ ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది.