Begin typing your search above and press return to search.

నచ్చిన ఇంటికోసం 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ని వాడేసింది.. ఎవరీ యువతి?

ఓ యువతి తన అవసరాలు తీర్చుకోవడానికి ఏకంగా 20 మంది అబ్బాయిలను ముగ్గులోకి దింపింది.

By:  Tupaki Desk   |   24 Jun 2025 3:24 PM IST
నచ్చిన ఇంటికోసం 20 మంది బాయ్  ఫ్రెండ్స్  ని వాడేసింది.. ఎవరీ యువతి?
X

ఓ యువతి తన అవసరాలు తీర్చుకోవడానికి ఏకంగా 20 మంది అబ్బాయిలను ముగ్గులోకి దింపింది. ఒకరికి తెలియకుండా ఒకరికి గర్ల్ ఫ్రెండ్ గా ఉంది. వాళ్లు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు ఆమె తనకు మాత్రమే గర్ల్ ఫ్రెండ్ అనుకున్నట్లున్నారు! కట్ చేస్తే.. ఆ 20 మందితోనూ ఒకే రకం గిఫ్ట్ ఇప్పించుకున్న ఆ యువతి, ఆ బహుమతులను అమ్మి, తనకు నచ్చిన ఓ ఇంటిని కొనుగోలు చేసింది.

అవును... అవసరం ఎంతటి పనినైనా చూపిస్తుందని అంటారు! అది నిజమే అయినా.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన.. 'కచ్చితంగా నిజమే' అని చెప్పేలా ఉంది. ఈ క్రమంలో చైనాలో ఓ యువతి తనకు నచ్చిన ఇంటిని కొనుగోలు చేయడానికి చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఏమా కథ, ఎవరా యువతి, ఏమా బహుమతులు అనేది ఇప్పుడు చూద్దామ్..!

వివరాళ్లోకి వెళ్తే... చైనా‌లోని షెన్జెన్‌ ప్రాంతానికి చెందిన యువతి షియాలీ తన కలల ఇంటిని కొనాలని బలంగా నిర్ణయించుకుంది. అయితే.. అందుకు ఆమె దగ్గర అంత సొమ్ము లేనట్లుంది! దీంతో.. సదరు చైనా అమ్మాయి 20 బాయ్‌ ఫ్రెండ్స్‌ ని ఏర్పాటు చేసుకుంది. ఒకరికి తెలియకుండా ఒకరితో (ప్రేమ) వ్యవహారం నడిపింది. వారిని ఫుల్ గ్రిప్ లో పెట్టుకున్నట్లుంది!

వారంతా ఈ ప్రేమ మైకంలో ఉన్న సమయంలో... 20 మంది బాయ్ ఫ్రెండ్స్ తో ఐఫోన్ లను కొనిపించుకుంది.. బహుమతిగా ఇప్పించుకుంది! ఆ తర్వాత తానుకున్న పనిని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆ ఐఫోన్స్ ని బయటి మార్కెట్ లో అమ్మేసింది. ఫలితంగా.. 1,20,000 యువాన్స్ అంటే సుమారు రూ.14 లక్షలు వరకు సంపాదించింది. ఆ సొమ్ముతో ఇంటిని కొనుక్కుంది.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పాపం ఆమె పరిస్థితి ఎలాంటిదో అని ఒకరంటే.. ఆమె విలువలు లేని వ్యక్తి అని మరికరు అంటున్నారు. ఇంకొంతమంది మాత్రం ఆమె చాలా టాలెంటెడ్ అని కితాబిస్తున్నారు.