తన సంతోషకరమైన రోజు ఇదేనట: చంద్రబాబు
కానీ.. ఈసారి మాత్రంజూలై తొలివారంలోనే ఇలా.. నీటిని వదిలి పెట్టే అవకాశం తనకురావడం తన జీవితం లో సంతోషాన్నిచ్చిన రోజుగా ఆయన అభివర్ణించారు.
By: Tupaki Desk | 8 July 2025 10:38 PM ISTఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా.. ఎప్పుడు మాట్లాడినా.. పనులు, అభివృద్ది గురించే మాట్లాడతా రు. అలాంటిది ఆయన తొలిసారి.. తన ఇష్టాలను గురించి చర్చించడం ఆశ్చర్యంగా మారింది. ``ఇదే నాకు.. నా జీవితంలో ఇష్టమైన రోజు`` అంటూ.. సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికి కారణం కూడా ప్రకటించా రు. ప్రస్తుతం ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తింది. దీంతో శ్రీశైలం జలాశయా నికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. గతంలో ఎప్పుడో రోశయ్య హయాంలో వచ్చినట్టుగా వరద వచ్చింది.
దీంతో శ్రీశైలం ప్రధాన గేట్లను సీఎం చంద్రబాబు మంగళవారం ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. తనకు ఎంతో సంతోషకరమైన రోజు ఇదేనని వ్యాఖ్యానించారు. దీంతో సభ మొత్తం చప్పట్లతో నిండిపోయింది. అంతేకాదు.. జూలై తొలి వారంలోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలి పెట్టడం కూడా ఇదే తొలిసారి అని చంద్రబాబు తెలిపారు. ఎప్పుడూ జూలై చివరి వారంలోనో.. ఆగస్టు మొదటి వారంలోనో నీటిని వదిలి పెడతామని చెప్పారు.
కానీ.. ఈసారి మాత్రంజూలై తొలివారంలోనే ఇలా.. నీటిని వదిలి పెట్టే అవకాశం తనకురావడం తన జీవితం లో సంతోషాన్నిచ్చిన రోజుగా ఆయన అభివర్ణించారు. శ్రీశైలంలో ప్రస్తుతం 200 టీఎంసీల నీరు నిల్వ ఉందన్న ఆయన.. దీనిని సీమకు విడుదల చేయడం ద్వారా అక్కడి రైతులకు మేలు చేస్తామన్నా రు. సీమ అభివృద్ధికి తాను ఏమీ చేయలేదన్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ సీమ అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. ఇప్పుడు కూడా బనకచర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని చెప్పారు.
సీమ అభివృద్ధికి తన వద్ద బ్లూ ప్రింట్ ఉందని చెప్పిన చంద్రబాబు.. బనకచర్ల ప్రాజెక్టును సాధించి తీరుతామని చెప్పారు. సముద్రంలో వృథాగా పోతున్న నీటిని వాడుకోవడం వల్ల.. ఇరు తెలుగు రాష్ట్రాలకూ ప్రయోజనం కలుగుతుందన్న ఆయన.. దీనికి అడ్డు పడడం సమంజసంకాదని పరోక్షంగా తెలంగాణ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. సీమ ప్రాంత రైతాంగానికి మేలు చేస్తామని చెప్పారు.