స్టార్ క్రికెటర్.. ముక్కోణపు ప్రేమ.. పెళ్లి.. పెటాకులు తప్పెవరిదో?
క్రికెట్ నే తీసుకుంటే కొన్నేళ్లలోనే శిఖర్ ధావన్-ఆయేషా ముఖర్జీ, హార్దిక్ పాండ్యా-నటాషా, తాజాగా యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడిపోయారు
By: Tupaki Desk | 24 April 2025 6:14 PM ISTక్రీడలు, సినిమా రంగంలో ప్రేమలు, పెళ్లిళ్లు.. విడాకులు అత్యంత సహజం. క్రికెట్ నే తీసుకుంటే కొన్నేళ్లలోనే శిఖర్ ధావన్-ఆయేషా ముఖర్జీ, హార్దిక్ పాండ్యా-నటాషా, తాజాగా యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడిపోయారు. ధావన్, హార్దిక్, చాహల్ టీమ్ ఇండియా తరఫున కీలక ఆటగాళ్లు. కెరీర్ మంచి ఊపులో ఉండగా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత భాగస్వాములతో విడిపోయారు.
అయితే, ఈ ఏడాది ఐపీఎల్ కు ముందు అందరికంటే చాహల్-ధనశ్రీ జంట వ్యవహారం అత్యంత ఆసక్తి రేపింది. కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ.. చాహల్ తో విడిపోతుందని ఎవరూ ఊహించలేదు. అయితే, అదే జరిగింది.
ధనశ్రీతో విడాకుల కేసు సెటిలయి.. లీగ్ లోకి ఆలస్యంగా వచ్చిన చాహల్.. మరో అమ్మాయితో డేటింగ్ లో ఉన్నట్లు తేలింది. ఆమె పేరు ఆర్జే మహ్ వష్. కాగా, చాహల్ మ్యాచ్ లకు ఆమె రావడం, సోషల్ మీడియాలో ఫాలో కావడం సహా వీరిద్దరి బంధాన్ని అనేక ఉదంతాలు బయటపెట్టాయి.
ఇప్పుడు అసలు విషయం ఏమంటే.. చాహల్-ధనశ్రీ విడిపోవడానికి మహ్ వష్ కారణం అని కొందరు ఆరోపిస్తున్నారు. చాహల్ ను తొలుత ధనశ్రీనే వదులుకుందని భావించిన అభిమానులు కూడా తాజా పరిణామాలను చూసి.. మహ్ వష్ కారణమని అభిప్రాయానికి వస్తున్నారు.
ఆ తాజా పరిణామాల్లో ఒకటి.. ధనశ్రీతో విడాకులైన వెంటనే మహ్ వష్ తో చాహల్ కనిపించడం అని పేర్కొంటున్నారు. దీంతో చహల్ వైపు నుంచే తప్పు జరిగిందనే వాదన తెరపైకి తెస్తున్నారు.
దీంతో చాహల్-ధనశ్రీ వ్యవహారం పెద్ద మలుపు తిరిగింది. దీనిపై చాహల్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో? ఎప్పటికి వస్తుందో?