Begin typing your search above and press return to search.

తేడా ట్రూడో పోయాడు.. కెనడా-భారత్.. మళ్లీ పాత స్నేహం?

తాజాగా జరిగిన ఎన్నికల్లో ట్రూడో పార్టీ (లిబరల్స్ పార్టీ)నే గెలిచింది. ఇప్పటికే ట్రూడో తప్పుకోవడంతో కొన్ని నెలల కిందట ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా కొనసాగనున్నారు.

By:  Tupaki Desk   |   29 April 2025 5:00 PM IST
తేడా ట్రూడో పోయాడు.. కెనడా-భారత్.. మళ్లీ పాత స్నేహం?
X

ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం.. స్వేచ్ఛతో పాటు ప్రశాంతతకు పెట్టింది పేరు.. భారతీయులు ఎక్కువగా ఉన్న దేశం.. ఉపాధి అవకాశాలు దొరికే ప్రదేశం.. ఇవీ గత రెండేళ్ల కిందటి వరకు కెనడా గురించి చెప్పుకొనే వివరాలు.

ఇప్పుడు చూస్తే కెనడాలో ఖలిస్థానీ వాదం పుంజుకుని.. ఆ దేశ ప్రధానిగా ఉన్న నాయకుడు భారత్ ను తప్పుబట్టి.. తమ దేశంలో అశాంతికి భారత్ కారణం ఆయన నోటితో అనిపించుకునే పరిస్థితి.

అయితే, భారత్ మంచికో ఏమోగాని.. కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో పదవీ పోయింది. తనపై ఉన్న వ్యతిరేకతతో ట్రూడో తప్పుకొన్నాడు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ట్రూడో పార్టీ (లిబరల్స్ పార్టీ)నే గెలిచింది. ఇప్పటికే ట్రూడో తప్పుకోవడంతో కొన్ని నెలల కిందట ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా కొనసాగనున్నారు.

వాస్తవానికి కెనడాలోని అన్ని రంగాల్లోనూ భారతీయులు తమ ప్రతిభ చాటుతున్నారు. లక్షల మంది విద్యార్థులు కెనడా చదువుకునేందుకు వెళ్లి స్థిరపడ్డారు. కెనడా క్రికెట్ జట్టులోనూ భారతీయులే ఎక్కువ. అయితే, ఖలిస్థానీల అంశంలోనే రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. దౌత్యవేత్తల బహిష్కరణ వరకు విషయం వెళ్లింది. ఇదంతా కూడా ట్రూడో కారణంగానే. ఇప్పుడు గెలిచిన కార్నీ మాత్రం భారత్ తో స్నేహం కోరుకుంటున్నారు. దౌత్య, వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు పెద్దపీట వేసేలా ఉన్నారు.

కెనడా పొరుగునే ఉండే అమెరికా ఇన్నాళ్లూ నమ్మకమైన మిత్ర దేశం. ట్రంప్ వచ్చాక కెనడానూ టారిఫ్ లతో బాదేశాడు. దీంతో అమెరికా-కెనడా సంబంధాలు చెడిపోయాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునర్ నిర్మాణం అవుతోందని, భారత్-కెనడా భాగస్వామ్య ఆర్థిక వ్యవస్థను కార్నీ కోరుకుంటున్నారు. ఇదే జరిగితే భారత విద్యార్థులకు కెనడాలో మళ్లీ స్వర్ణయుగం వచ్చినట్లే.