ఏపీలో బీజేపీ చేసింది.. నేతలు చేయాల్సింది ఇదే...!
ఇలా బీజేపీ ఏపీ విషయంపై సైలెంట్ ఆపరేషన్‌ను ముందుకు తీసుకువెళ్తోంది. ఇలా ఏం చేసినా.. పార్టీని డెవలప్ చేయడం తోపాటు.. పార్టీని క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచన ఉంది.
By: Tupaki Desk | 29 April 2025 9:01 PM ISTఏపీలో బీజేపీ విస్తరణ వ్యవహారం దాదాపు ఒక గ్రాఫ్ రూపంలో కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎలా ఉన్నా.. ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఏపీపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఒకవైపు రాష్ట్రానికి సంబంధించిన సహకారం అందిస్తూ.. మరోవైపు.. పార్టీ పరంగా కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీని పుంజుకునేలా చేయాల్సిన బాధ్యత ఇప్పుడు నాయకులపై పడిందని పరిశీలకులు చెబుతున్నారు.
అభివృద్ధి పరంగా చూసుకుంటే.. కూటమి పార్టీల ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం బాగానే ఉందని .. సీఎం చంద్రబాబు చెబుతున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు.. అమరావతి రాజధానికి రుణం ఇ ప్పించడం.. గ్రాంట్లు ఇవ్వడం(1500 కోట్లు) వంటివి మేలి మలుపులుగా సీఎం ఒప్పుకొంటున్నారు. అదేస మయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలోనూ కేంద్రం నుంచి సహకారం బాగానే ఉంది. దీంతో ఏపీలో పనులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇక, రాజకీయం పరంగా సామాజిక వర్గాల వారీగా నాయకులకు పదవులు ఇస్తుండడం గమనార్హం. కమ్మ, కాపు, రెడ్డి, శెట్టి బలిజ ఇలా.. మెజారిటీ సామాజిక వర్గాలకు బీజేపీ అధిష్టానం నుంచి అభయ హస్తం లభిస్తోంది. కమ్మలకు ఎంపీ టికెట్లు ఇచ్చింది. కాపు సామాజిక వర్గం సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇస్తే.. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పాకా సత్యనారాయణకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసింది. ఇక, రెడ్డి వర్గానికి, యాదవ వర్గానికి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చింది.
ఇలా బీజేపీ ఏపీ విషయంపై సైలెంట్ ఆపరేషన్‌ను ముందుకు తీసుకువెళ్తోంది. ఇలా ఏం చేసినా.. పార్టీని డెవలప్ చేయడం తోపాటు.. పార్టీని క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచన ఉంది. అయితే.. ఇప్పుడు పార్టీని ముందుకు నడిపించే బాధ్యత నాయకులపైనే ఉంది. పదవులు దక్కాయని.. పరిమితమవుతారో.. లేక నడుం వంచి.. ప్రజల మధ్య ఉంటారో.. అనే దానిని బట్టే.. బీజేపీ భవిష్యత్తు ఏపీలో ఆధారపడి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.