Begin typing your search above and press return to search.

బీజేపీ సంబరాల మీద నీళ్ళు చల్లిందా ?

బీజేపీ ఉత్సాహంతో చేసుకుంటున్న వేడుకల మీద నీళ్ళు చల్లినట్లుగా ఈ దుర్ఘటన ఉందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 Jun 2025 12:00 AM IST
బీజేపీ సంబరాల మీద నీళ్ళు చల్లిందా ?
X

దేశంలో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చి కేవలం 13 రోజులు మాత్రమే ఉంది. ఆ తరువాత 13 నెలలు, మరోసారి నాలుగున్నరేళ్ళు పాలించింది. అయితే పూర్తి టెర్మ్ ఫుల్ మెజారిటీతో బీజేపీ తన పాలన తొలిసారి పూర్తి చేసుకుంది నరేంద్ర మోడీ హయాంలోనే. 2014 నుంచి 2019 మధ్యలో అది సాధించింది. ఇక 2019 నుంచి 2024లో మరోసారి అంతకు మించిన మెజారిటీతో ఫుల్ టెర్మ్ పూర్తి చేసుకుంది బీజేపీ.

ఇక 2024 ఎన్నికల్లో మూడవసారి ఫుల్ మెజరిటీకి కాస్తా దూరంలో ఉన్నా మిత్రపక్షాలు ఆదుకోవడంతో కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అలా 11 ఏళ్ల పాటు పాలన బీజేపీది నిర్విఘ్నంగా సాగుతూ వస్తోంది. దాంతో ఈ నెల 9 నుంచి 11 ఏళ్ళ బీజేపీ పాలన మీద దేశవ్యాప్తంగా సంబరాలు స్టార్ట్ అయ్యాయి.

డెబ్బై రోజుల పాటు దేశం నలుమూలలలో బీజేపీ విజయాలను ఈ సందర్భంగా ప్రచారం చేయాలని ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించి ఆ ప్రకారం పార్టీ అంతా అలెర్ట్ అయి జనంలోకి వస్తోంది. ఈ విధంగా బీజేపీ సమరోత్సాహంతో ఉన్న వేళ అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కేవలం 59 సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోవడం కనీ వినీ ఎరగని తీరులో ప్రమాదం జరగడం నిజంగా షాకింగ్ న్యూస్ గా మారింది.

బీజేపీ ఉత్సాహంతో చేసుకుంటున్న వేడుకల మీద నీళ్ళు చల్లినట్లుగా ఈ దుర్ఘటన ఉందని అంటున్నారు. బీజేపీ ఆపరేషన్ సిందూర్ గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. అయితే దేశీయ విమానం అందులో ప్రఖ్యాత సంస్థకు చెందినది అయిన ఒక భారీ సాంకేతికత కలిగిన విమానం ఇలా కుప్ప కూలడం 250 మంది దాకా మరణించడం అంటే ఇది ప్రపంచమే ఉలిక్కి పడేలా చేసింది అని అంటున్నారు.

అతి పెద్ద విమాన ప్రమాదాలలో ఒకటిగా ఇది నిలిచింది అని అంటున్నారు. దీంతో ఈ పెను ప్రమాదం దేశీయ విమానయాన రంగం మీద పెను ప్రభావం చూపిస్తోంది. అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పుకుంటున్న వేళ ఎక్కడ చూసినా విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తూ మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తున్న సందర్భంలో జరిగిన ఈ ఘోరకలి అందరినీ ఆలోచనలో పడేస్తోంది.

అంతే కాదు భద్రతాపరమైన సందేహాలను తావు ఇస్తోంది అని అంటున్నారు. ఒక ప్రఖ్యాత సంస్థ నడిపే విమానాలు అంతర్జాతీయంగా నిత్యం పదుల సంఖ్యలో నడిచే విమానాలు ఉన్న నేపథ్యంలో ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన సెకన్ల వ్యవధిలో కుప్ప కూలడం అంటే భద్రతాపరమైన తనిఖీల మీదనే నిపుణుల నుంచి సందేహాలు వస్తున్నాయని అంటున్నారు.

సరే దాని మీద పూర్తి నివేదికలు దర్యాప్తులు జరిగిన తరువాత చర్యలు ఉండొచ్చు. కానీ బీజేపీ 11 ఏళ్ళ పాలన మీద ఉత్సాహపూరితంగా సాగుతున్న కార్యక్రమాలకు మాత్రం కొంత ఉత్సాహం తగ్గించేలా ఈ దుర్ఘటన జరిగింది అని అంటున్నారు.