అప్పట్లో జగన్ నీచంగా ఆలోచించాడు: బాలయ్య సంచలన వ్యాఖ్యలు
టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే.. నటసింహం నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Garuda Media | 14 Aug 2025 12:17 AM ISTటీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే.. నటసింహం నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై ఆయన నిప్పులు చెరిగారు. ``అప్పట్లో జగన్ సహ కరించి ఉంటే.. `` అంటూ విమర్శలు గుప్పించారు. ``బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా నేనేమీ వెనుకేసుకోను. పేదలకు రూపాయి ఖర్చులేకుండా.. సేవ చేయాలన్నది అమ్మ(బసవ తారకం) కోరిక. దానినే నేను నెరవేరుస్తున్నా.`` అని బాలయ్య వ్యాఖ్యానించారు.
తాజాగా ఏపీ రాజధాని అమరావతిలో బసవ తారకం ఆసుపత్రికి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మాణా లు చేపట్టేందుకు వీలుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు 2018లోనే 21 ఎకరాల భూమిని కేటాయించారని చెప్పారు. 2019లో వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలుగా శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టామన్నారు. అయితే.. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతిపై విషం చిమ్మిందని.. దీంతో తమ నిర్మాణాలు కూడా ఆగిపోయా యని చెప్పారు.
``నేను అప్పట్లో జగన్‌ను కోరా.. సహకరించండి.. ఎంతో మంది సేవలకు ఉచితంగా వైద్యం చేసుకోవచ్చు. మీరు కూడా ఆరోగ్య శ్రీద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. అని చెప్పా. ఆయన పట్టించుకోలేదు. నీచంగా ఆలోచన చేశాడు`` అని బాలయ్య వ్యాఖ్యానించారు. నాడు ఆప్రభుత్వం అడ్డు పెట్టకపోయి ఉంటే.. ఏ మాత్రం సహకరించి ఉంటే.. ఇప్పటికే అమరావతిలో బసవ తారకం ఆసుపత్రి సేవలు అందుబాటులోకి వచ్చి ఉండేవని బాలయ్య చెప్పారు. తాము నిస్వార్థ్యంగానే సేవ చేస్తున్నామని బాలయ్య వెల్లడించారు.
ఈ ఆసుపత్రి నుంచి మేం రూపాయి కూడా తీసుకోబోమని.. విరాళాల ద్వారా నే ఆసుపత్రి నడుస్తుందని బాలయ్య చెప్పారు. చాలా మంది వైద్యులు ఇక్కడ ఉచిత సేవలు కూడాఅందిస్తారని చెప్పారు. అయినా.. గత ప్రభుత్వం తమపై కక్ష కట్టినట్టు వ్యవహరించిందని.. బాలయ్య నిప్పులు చెరిగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాకతో వడివడిగా నిర్మాణాలు మొదలు పెట్టాలని నిర్ణయించామని.. త్వరలోనే కల సాకారం అవుతుందన్నారు. 2028 నాటికి సేవలు అందించేలా ప్లాన్ చేసినట్టు వివరించారు.